70 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం..! డిసెంబర్ 12 న ఆకాశంలో..?!

డిసెంబర్ నెల 12వ తేదిన ఆకాశంలో అద్భుతం జరుగనుంది.సుమారు 70వేల ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ నెల 12 న ఆ అద్భుతం జరగడం విశేషం అనే చెప్పాలి.12వ తేదిన భూమికి అతిచేరువగా ఒక ఆకుపచ్చని రంగులో ఉండే ఒక తోకచుక్క మిరిమిట్లు గొలిపే కాంతులను విరజిమ్ముతూ దూసుకొని రాబోతుంది.ఈ తోక చుక్క ప్రత్యేకత ఏంటంటే.

 Miracle In The Sky After 70 Years In The Sky On December 12th 70 Years, Sky, Lat-TeluguStop.com

సాధారణ తోక చుక్కల మాదిరిగా పసుపురంగులో కాకుండా ఈ తోకచుక్క మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందట.ఇలా ఆకుపచ్చ రంగులో తోక చుక్కలు కనిపించడం చాలా అరుదుగా కనిపిస్తాయట.

ఈ తోకచుక్కల్లో రసాయనాలు మండుతూ ఉండడం వలన ఆకు పచ్చ రంగులో మెరుపులు వెదజల్లుతుంటాయి.ఈ  తోక చుక్క ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది.

ఇలాంటి తోకచుక్క భూమికి చేరువగా రావడమనేది 70వేల సంవత్సరాల్లో ఇదే మొదటిసారి అవ్వడం విశేషం.

అంతేకాకుండా ఈ తోకచుక్కకు ఒక స్పెషాలిటీ కూడా ఉందండోయ్.

అదేంటంటే.ఈ తోక చుక్కకు, తిమింగలానికి పోలిక ఉందట.

ఈ తోకచుక్క NGC 4631 గెలాక్సీ నుంచి దూసుకొస్తోంది.ఇది గెలాక్సీ తిమింగలం మాదిరిగా ఉండటం వల్ల దానికి తిమింగలం గెలాక్సీ అని పేరు వచ్చింది.

ఇప్పుడు ఈ తోక చుక్క భూమికి చేరువగా రానుందట.ఇందులో విశేషం ఏంటంటే.

డిసెంబర్ మాసమంతా ఈ తోకచుక్క మనకు కనిపిస్తూనే ఉంటుందట.కానీ ఈ నెల 12 తేదీన మాత్రం మనకు స్పష్టంగా ఈ తోక చుక్క కనిపిస్తుందని అంటున్నారు సైంటిస్టులు.

Telugu Latest, Tail Drop-Latest News - Telugu

ఈ తోకచుక్క లక్ష్యం సూర్యగ్రహమేనని చెబుతున్నారు పరిశోధకులు.ఈ తోక చుక్క సూర్యుని చుట్టూ పరిభ్రమించి ఆపై తిరిగి గెలాక్సీ దిశగా పయనించనుందని అంటున్నారు సైంటిస్టులు.గ్రీన్ కలర్ తోకచుక్క జనవరి 3, 2022 రోజున సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లనుంది.అప్పుడు అత్యంత కాంతివంతంగా మారి చిన్నదిగా కనిపించనుంది.మీరు ఈ తోకచుక్కను చూడాలనుకుంటే డిసెంబర్ 12న సూర్యోదయం కాకముందే తూర్పు-ఈశాన్య దిక్కు నుంచి చూడాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు ఆ సమయంలో చూడలేకపోతే కనుక రోజూ ఉదయం సూర్యోదయానికి 2 గంటల ముందు తూర్పు దిక్కులో మీరు ఈ తోక చుక్కని చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube