మిరాకిల్.. బ్రెయిన్‌లో సూదిని బయటకు తీసిన వైద్యులు.. అరుదైన సర్జరీ

సాధారణంగా మానవ శరీరంలోని ఏదైనా ప్రదేశంలో సూది తాకినప్పుడు లేదా గుచ్చుకున్నపుడు స్ట్రేట్‌గా లోపలికి వెళ్తుండటం మనం చూడొచ్చు.ఉదాహారణకు సూది మోకాలు లేదా చేయికి గుచ్చుకున్నపుడు కొంచెం లోపల వెళ్లగానే తెలుస్తుంది.

 Miracle Doctors Who Took The Needle Out Of The Brain Rare Surgery-TeluguStop.com

కానీ, మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలో వ్యక్తి ముక్కు నుంచి మెదడులోకి వెళ్లిందట.అవునండీ మీరు చదివింది నిజమే ముక్కు నుంచి బ్రెయిన్‌లోకి వెళ్లిన ఆ సూదిని వైద్యులు సర్జరీ ద్వారా బయటకు తీశారు.

పూర్తి వివరాల్లోకెళితే.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఇటీవల ఓ పేషెంట్ వచ్చాడు.సదరు పేషెంట్ గాయాలతో ఆస్పత్రిలోకి రాగా, వైద్యులు ట్రీట్‌మెంట్ నిమిత్తం పలు స్కానింగ్‌లు చేశారు.ముక్కు మీద ఆయనకు గాయం అయింది.

 Miracle Doctors Who Took The Needle Out Of The Brain Rare Surgery-మిరాకిల్.. బ్రెయిన్‌లో సూదిని బయటకు తీసిన వైద్యులు.. అరుదైన సర్జరీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే, ఆ వ్యక్తి మద్యం తాగి ఉండటం గమనించి అతడిని ఎవరైనా కొట్టారేమో అని డాక్టర్స్ భావించారు.

ఇక అతడికి ట్రీట్‌మెంట్ చేసే క్రమంలో స్కానింగ్ చేసిన రిపోర్ట్స్ రాగా, అవి చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.మెదడు సిటి స్కాన్‌లో నోస్ నుంచి బ్రెయిన్ వరకు సూది విస్తరించి ఉండటం చూసి, తాము చూసింది నిజమేనా? అని అనుకున్నారు.ఈ క్రమంలోనే దానిని బయటకు తీయాలనుకున్నారు.

ఆ ప్రదేశంలోకి సూది ఎలా ప్రవేశించిందనేది మిస్టరీగానే ఉన్నది.అరుదైన సర్జరీకి పూనుకుని డాక్టర్స్ శ్రమించి వైద్యం చేశారు.

అయితే, ఇందుకు మొదలు పేషెంట్ బ్రెయిన్ ఓపెన్ చేశారు.ఆ తర్వాత ముక్కు భాగం నుంచి సూదిని బయటకు తీశారు.

సదరు 50 ఏళ్ల వ్యక్తి సర్జరీలో పూర్తిగా సహకరించాడని, పుర్రెభాగాన్ని ఓపెన్ చేయడం ద్వారానే ఈ అరుదైన సర్జరీ సక్సెస్ ఫుల్ అయిందిని కోల్‌కతా న్యూరోసైన్స్ సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు.సర్జరీ సమయంలో సదరు పేషెంట్ యాక్టివ్‌గానే ఉన్నాడని వైద్యులు చెప్పారు.

#Kolkatta #Scanning #Brain #Nose #Niddle In Brain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు