మిరాకిల్ : ఆడుకుంటున్న పిల్లాడిపై నుండి కార్ దూసుకుపోయింది..అయినా చిన్న దెబ్బ తగలకుండా బయటపడ్డాడు..  

Miracle Caught On Camera: Car Runs Over Boy But Kid Remains Unhurt -

ఒక మనిషిపైనుండి కార్ దూసుకళ్తే ఇక ఆ మనిషి ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటారు.కానీ ముంబైలో ఒక పిల్లాడు మాత్రం కారు తనపై నుండి వెళ్లినా కూడా ప్రాణాలతో బతికిపోయాడు…బతకడమే కాదు.

ఏ చిన్న దెబ్బ తగలకుండా ఎంచక్కా లేచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.నమ్మలేకున్నా ఇదే నిజం.

మిరాకిల్ : ఆడుకుంటున్న పిల్లాడిపై నుండి కార్ దూసుకుపోయింది..అయినా చిన్న దెబ్బ తగలకుండా బయటపడ్డాడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అధ్బుతాలు అప్పుడప్పడే జరుగుతాయి.ఇప్పుడు ఈ వీడియో చూస్తే నిజంగా ఇది అద్బుతం అని అంటారు.

ముంబై నగరంలోని చెంబూర్ ప్రాంతంలోని వీధిలో పిల్లలంతా ఆటలాడుకుంటున్నారు.అటూఇటూ పరుగెత్తుతున్నారు.ఆటలో భాగంగా కిందపై కూర్చుంటున్నారు.వారు ఆడుతున్నది రోడ్డుపైనే.వెహికిల్స్ అటు ఇటు వెళ్తున్నాయి.చుట్టూ కార్లు పార్క్ చేసి ఉన్నాయి.

అలా ఓ పిల్లవాడు వచ్చి రోడ్డు పక్కన ఆపిన ఓ కారు దగ్గరగా కూర్చున్నాడు.డ్రైవర్‌కు ఏమాత్రం కనిపించే వీలు లేదు.

డ్రైవర్ తనదారిన తాను కారును స్టార్ట్ చేసి ముందుకు కదిలించాడు.పిల్లవాడు కారు కింద పడిపోయాడు.

కారు డ్రైవర్ రయ్యిమని వెళ్లిపోయాడు.ఇంకేముంది? అయ్యో పిల్లవాడి ప్రాణాలు గాల్లో కలిశాయా అని అనుకుంటారు చూసేవాళ్లంతా… కానీ కారు వెళ్లిపోగానే పిల్లవాడు లేచి ఏం జరగనట్టు మళ్లీ ఆటవైపు వెళ్లిపోయాడు.ఇది ఇలా జరిగింది అని చెప్పడానికి ఎవరూ లేరు.ఎందుకంటే అక్కడున్న వాళ్లు కూడా ఆటలో మునిగిపోయారు.డ్రైవర్ అసలు ఆ బాబుని చూడనేలేదు…కానీ సెక్యూరిటీ కెమెరా దీనినంతటినీ రికార్డు చేసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతున్నది…ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.

తాజా వార్తలు

Miracle Caught On Camera: Car Runs Over Boy But Kid Remains Unhurt- Related....