పాపం మీరా జాస్మిన్.. అప్పట్లో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుందంటూ ప్రచారం?

Mira Jasmine Was Advertised As Using Birth Control Pills At That Time

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరియర్ మొదట్లో తమిళ మళయాళ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Mira Jasmine Was Advertised As Using Birth Control Pills At That Time-TeluguStop.com

ఈమె నటించిన మలయాళ చిత్రాలకుగాను ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకుంది.ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీరా జాస్మిన్ తెలుగులో కూడా నటించారు.

అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, పందెంకోడి వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె కి అనంతరం హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.ఈ క్రమంలోనే సినిమాలలో చెల్లెలి పాత్రలో నటిస్తూ విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు.

 Mira Jasmine Was Advertised As Using Birth Control Pills At That Time-పాపం మీరా జాస్మిన్.. అప్పట్లో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుందంటూ ప్రచారం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా హీరో రాజశేఖర్ ,ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన గోరింటాకు చిత్రంలో ఈమె రాజశేఖర్ చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వారి చేత కంటతడి పెట్టించింది.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగుతెరకు కూడా దూరం అయింది.

Telugu Anil John Tyson, Control Pills, Dubai Engineer, Meera Jasmine, Mira Jasmine, Tollywood-Movie

ఈ క్రమంలోనే మీరా జాస్మిన్ దుబాయ్ లో ఇంజనీర్ గా పని చేస్తున్నటువంటి అనిల్ జాన్ టైసన్ అనే వ్యక్తిని ఫిబ్రవరి 9 ,2014 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.వివాహం అనంతరం మీరాజాస్మిన్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు.తన భర్తతో కలిసి విదేశాలలో ఉన్న మీరాజాస్మిన్ గురించి అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.సాధారణంగా ఒక హీరో లేదా హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల పుకార్లు పుడుతుంటాయి.

అలా హీరోయిన్ మీరా జాస్మిన్ విషయంలో కూడా ఎన్నో పుకార్లు పుట్టాయి.

Telugu Anil John Tyson, Control Pills, Dubai Engineer, Meera Jasmine, Mira Jasmine, Tollywood-Movie

మీరా జాస్మిన్ పెళ్లి అయిన తర్వాత పిల్లలు వద్దని భావించుకున్నారని ఈ క్రమంలోనే తనకు పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఇలా తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి ఈ విధంగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మీరాజాస్మిన్ ఎంతో మానసిక వేదనను అనుభవించింది.అయితే తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి ఈ విధంగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చాలా మంది అవి నిజమేనని భావించారు.

అయితే తన గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఈమె వెల్లడించారు.

Telugu Anil John Tyson, Control Pills, Dubai Engineer, Meera Jasmine, Mira Jasmine, Tollywood-Movie

సాధారణంగా పెళ్ళి అయిన తరువాత సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ఎవరైనా కొన్ని రోజులపాటు వారి వైవాహిక జీవితంలో సంతోషంగా గడపాలని భావిస్తారు.ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు పిల్లలు వద్దని భావించుకుంటారు.ఈమె కూడా అదే ఆలోచనతో కొన్ని రోజులు పిల్లలు వద్దని భావించుకున్నారు కానీ అప్పట్లో ఈ విషయం తెలుసుకొని సోషల్ మీడియాలో పిల్లలు కాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుంది అంటూ ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన మీరాజాస్మిన్ ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి సానుకూలంగా ఉందని ఏవైనా మంచి అవకాశాలు వస్తే సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తానని ఒకానొక సందర్భంలో వెల్లడించారు.

#Control Pills #Dubai Engineer #Mira Jasmine #Meera Jasmine #Anil John Tyson

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube