అమీర్ పేట డివిజన్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

ఎంతో మహిమ కలిగిన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం ద్వారా ఆలయ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట డివిజన్ లో 2.43 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.ముందుగా సుప్రబాత్ నగర్ లో 2.20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు.అనంతరం బల్కంపేట బస్తీలో 18.90 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం బోనాల కాంప్లెక్స్ లో ACDP నిధులు 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్ ను ప్రారంభించారు.

 Minster Talasani Srinivas Yadav Initiated Developmental Works In Ameerpet Detail-TeluguStop.com

అదేవిధంగా SR నగర్ హౌసింగ్ బోర్డ్ కమ్యునిటీ హాల్ (సాయి మెన్షన్) వద్ద 18.40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.SR నగర్ యాక్సిస్ బ్యాంక్ నుండి కమ్యునిటీ హాల్ వరకు 18.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు.బాపునగర్ లోని ముస్లీం బస్తీలో 10.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు.బాపునగర్ లో 3.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ పునరుద్దరణ పనులను ప్రారంభించారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నట్లు చెప్పారు.బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి నగరం నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తుంటారని తెలిపారు.భక్తుల సౌకర్యార్ధం 3.37 కోట్ల రూపాయల వ్యయంతో మల్టి లెవెల్ పార్కింగ్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఆలయం ముందున్న వైట్ టాపింగ్ రోడ్ పై ఉన్న సెంట్రల్ లైటింగ్ పోల్స్ కు స్ట్రిప్ లైట్స్ ను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ప్రారంభించలేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా, స్ట్రిప్ లైట్స్ ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా ఆలయం పక్కన బోనం కాంప్లెక్స్ రోడ్ లో కూడా ఆలయం ముందు నిర్మించిన విధంగానే దాతల సహకారంతో షెడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కోట్లాది రూపాయల వ్యయంతో కనీస సౌకర్యాలు, మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు వివరించారు.బాపునగర్ లోని ముస్లీం బస్తీ లో డ్రైనేజి, మంచినీటి పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే CC రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా బాపునగర్ బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు ESI స్మశాన వాటిక స్థలంలో కర్మకాండల నిర్వహణ కోసం ఒక షెడ్డు ను నిర్మిస్తామని బస్తీవాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, DC వంశీ, EE ఇందిర, ఎల్లమ్మ దేవాలయం EO అన్నపూర్ణ, హార్టికల్చర్ DD శ్రీనివాస్, వాటర్ వర్క్స్ GM హరి శంకర్, AMOH భార్గవ్, ఎలెక్ట్రికల్ DE కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Minister Talasani Srinivas Yadav Initiated Development Works

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube