దొంగలను అద్దెకి తెచ్చుకుంటున్న 'గ్యాంగ్'లు.. ఎక్కడంటే?

సినిమాల త‌ర‌హాలో క్రైమ్ లు జ‌రిగిన ఘ‌ట‌న‌లు చాల‌నే ఉన్నాయి.కానీ ఇప్పుడు మీరు చ‌దువ‌బోయేది అంత‌కు మించిన స్థాయిలో ఉంటుంది.

 Minors From Madhya Pradesh Villages Leased Lakhs By Burglary Gangs-TeluguStop.com

నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా అనిపిస్తుంది తాజాగా వెలుగు చేసిన ఓ ఘ‌ట‌న గురించి తెలిస్తే.అదే ఢిల్లీ క్రైమ్ క‌థ‌.

ఇచ్చ‌ట అన్ని రిపేర్లు చేయ‌బ‌డును అనే సినిమా డైలాగ్ మాదిరిగా.ఇచ్చ‌ట దొంగ‌ల రిక్రూట్ మెంట్ జరుగును.

 Minors From Madhya Pradesh Villages Leased Lakhs By Burglary Gangs-దొంగలను అద్దెకి తెచ్చుకుంటున్న గ్యాంగ్’లు.. ఎక్కడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ట్రైనింగ్ తో పాటు భారీగా వేత‌నాలు ఇవ్వ‌బ‌డును అని చెబుతోంది ఈ క్రైమ్ క‌థ‌.

మైనర్ల‌కు అద్దెకు తీసుకురావ‌డంతో పాటు వారికి దొంగ‌త‌నాలు చేయ‌డంలో శిక్ష‌ణ ఇస్తారు.

అద్దె త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి.సూటుబూటు వేసుకుని.

పంక్ష‌న్లు, పెళ్లిళ్ల‌ను టార్గెట్ పెట్టుకుని అతిథుల్లా అక్క‌డికి చేరుకుని.భారీ న‌గ‌లు, డ‌బ్బుల‌తో ఉడాయిస్తారు.

తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఢిల్లీలో వెగులు చూసింది.ఇందులో ప‌ట్టుప‌డిన వారిలో చాలా మంది మైన‌ర్లు కావ‌డంతో పోలీసులు మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేశారు.

దీంతో విస్తుపోయే.షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.అదేంటంటే.దొంగ‌ల ముఠాలు మైన‌ర్ల‌కు టార్గెట్ చేసి.

వారిని లీజుకు తీసుకుంటున్నారు.వారికి దొంగ‌త‌నం చేయ‌డం నేర్పించి.

క్రైమ్‌ల‌కు పాల్ప‌డుతున్నారు.అతిథుల్లా పెళ్లి, పంక్ష‌న్ల‌కు చేరుకుని.

ఒక్కొక్క‌రు ఒక్కో ప‌నిచేస్తూ.దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు.

ఇక్క‌డ ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మేమంటే.దొంగ‌త‌నాలు చేయ‌డానికి వ‌స్తున్న మైన‌ర్ల‌ను దొంగ‌ల ముఠాకు వారిని లీజుకు ఇస్తున్న వారి సొంత త‌ల్లిదండ్రులే కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

వారు ఇలా చేయ‌డానికి కార‌ణం దొంగ‌ల ముఠాలు.మైన‌ర్ల‌కు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు స‌మంగా భారీగా వేత‌నాలు ఇవ్వ‌డ‌మేన‌ని పోలీసుల విచార‌ణలో వెల్ల‌డైంది.ఒక్కొక్క‌రికి నెల‌కు రూ.ల‌క్ష‌కు పైనే చెల్లిస్తున్నార‌ట‌.దీంతో త‌ల్లీ దండ్రులు వారిని దొంగ‌ల ముఠాకు లీజుకు ఇస్తున్నారు.అద్దెకు వ‌స్తున్న వారిలో ఎక్కువ‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌డ్ ప్రాంత మైన‌ర్లు ఉంటున్నార‌ని పోలీసులు తెలిపారు.ప‌ట్టణాల‌ను, న‌గ‌రాల‌ను టార్గెట్ చేసుకునీ, కొద్దికాలం అక్క‌డే మాకాం వేసి ఈ దొంగ ముఠాలు క్రైమ్స్ కు పాల్ప‌డుతున్నార‌ని వివ‌రించారు.

#Madhya Pradesh #Leasing Them #Crime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు