దారుణం : బిర్యానీ కోసం గొడవ పడి మైనర్ బాలిక ఏకంగా…..  

Minor girl, Suicide news, Chicken Biryani, hyderabad, Crime news, telangana, - Telugu Chicken Biryani, Crime News, Hyderabad, Minor Girl, Suicide News, Telangana

ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి విచక్షణ కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం అలవాటైపోయింది.తాజాగా ఓ మైనర్ బాలిక బిర్యానీ కోసం తన అన్నతో గొడవ పడి తీవ్ర మనస్థాపానికి గురై ఏకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో కలకలం సృష్టించింది.

 Minor Girl Fight Chicken Biryani Hyderabad

వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో ప్రశాంతి అనే మహిళ తన భర్త, ఇద్దరి పిల్లలతో కలిసి నివాసముంటోంది.ఈ క్రమంలో ఈ ఇద్దరు దంపతులు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ  కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఇద్దరూ నిన్నటి రోజున పని నిమిత్తమై బయటికి వెళ్లారు.సరిగ్గా ఇదే సమయంలో తమ పొరుగు ఇంట్లో నివాసం ఉండేటువంటి ఓ కుటుంబం బిర్యానీ పంపించారు.

దారుణం : బిర్యానీ కోసం గొడవ పడి మైనర్ బాలిక ఏకంగా…..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ బిర్యానీ తినే విషయంలో ప్రశాంతి కొడుకు మరియు కూతురు స్నేహ ఇద్దరు గొడవ పడ్డారు.

దీంతో స్నేహ తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.ఇందులో భాగంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 పని ముగించుకొని ఇంటికి వచ్చిన దంపతులు ఒక్కసారిగా విగతజీవిగా వేలాడుతూ ఉన్నటువంటి తమ కన్న కూతురు ని చూసి బోరున విలపించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

#Telangana #Chicken Biryani #Minor Girl #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Minor Girl Fight Chicken Biryani Hyderabad Related Telugu News,Photos/Pics,Images..