ఒంటరి తనం భరించలేక ప్రేమలో పడింది....చివరికి  

Minor Girl Commits Suicide In Hyderabad - Telugu Hyderabad Crime News, Hyderabad Latest News, Hyderabad News, Minor Girl, Minor Girl Commits Suicide, Minor Girl Latest News, Minor Girl News

ప్రస్తుత కాలంలో కొందరు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.తాజాగా తల్లిదండ్రులు లేనటువంటి ఓ మైనర్ బాలిక ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో చోటు చేసుకుంది.

Minor Girl Commits Suicide In Hyderabad

వివరాల్లోకి వెళితే తులసి అనే పదిహేడేళ్ల బాలిక హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో తన అమ్మమ్మ దగ్గర నివాసముంటుంది.తులసి స్థానికంగా ఉన్నటువంటి ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.

చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోయినటువంటి తులసి సంరక్షణని తన అమ్మమ్మ కోమలి బాయ్ చూసుకుంటూ వుండేది.అయితే ఎప్పుడూ తన తల్లిదండ్రులు లేకపోవడంతో మానసిక వేదనకు గురై తనలో తానే కుమిలి పోతూ ఉండేది తులసి.

ఈ క్రమంలో తులసికి స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ఈ పరిచయం కాస్త ప్రేమ వైపు అడుగు వేసింది.

అయితే తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఆమె ప్రియుడు పరీక్షల మీద దృష్టి సారించామని చెప్పి గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలో కొందరు పోకిరీలు ప్రేమిస్తున్నానంటూ తులసి వెంటపడటం మొదలు పెట్టారు.దీంతో ఒకపక్క ఒంటరితనం, మరోపక్క పోకిరీల వేధింపులు తాళలేక చావే శరణ్యం అనుకుంది తులసి.

ఇందులో భాగంగా సూసైడ్ నోట్ రాసి పెట్టి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇది గమనించిన స్థానికులు వెంటనే తులసిని కిందికి దింపినప్పటికీ ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే స్థానికులు మరియు తులసి రాసినటువంటి సూసైడ్ నోట్ ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Minor Girl Commits Suicide In Hyderabad-hyderabad Latest News,hyderabad News,minor Girl,minor Girl Commits Suicide,minor Girl Latest News,minor Girl News Related....