బండి నడుపుతూ పట్టుబడ్డ మైనర్.. ఆన్సర్స్ ఎంత తాపీగా చెప్పాడో..!

డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా రూల్స్ మర్చిపోకూడదు.డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్స్ పాటించపోతే పోలీసులు కఠినమైన శిక్షలు కూడా అమలు చేస్తారు.

 Minor Boy Bike Driving At Warangal He Give Shocking Answers To Traffic Police-TeluguStop.com

మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే భారీ జరిమానా తో పాటు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు.పెద్దవారు ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడిపితేనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి.

అలాంటిది పిల్లలు వాహనాలు నడపడం ఎంతో రిస్క్ తో కూడుకున్న పని.ఇప్పటికే చాలా మంది మైనర్ పిల్లలు వాహనాలు నడిపి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు.వాళ్ళ కుటుంబాలను శోక సంద్రంలో ముంచేశారు.పోలీసులు ఎంత చెబుతున్న మైనర్ పిల్లలు మాత్రం వాహనాలు నడపడం ఆపడం లేదు.తల్లిదండ్రులు కూడా మా పిల్లలు బైక్ బాగా నడుపుతున్నారు అంటూ సంబర పడుతున్నారు.

 Minor Boy Bike Driving At Warangal He Give Shocking Answers To Traffic Police-బండి నడుపుతూ పట్టుబడ్డ మైనర్.. ఆన్సర్స్ ఎంత తాపీగా చెప్పాడో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అలా మైనర్ పిల్లలు వాహనాలు నడప కూడదని మాత్రం ఆలోచిండడం లేదు.

ఏదో సరదాగా నేర్పిస్తున్నామని అనుకుంటున్నారు.కానీ వాళ్ళు రోడ్డు మీదకు వాహనాలతో వెళ్లి బీభత్సం చేస్తారని మాత్రం ఊహించడం లేదు.

తాజాగా ఒక మైనర్ బాలుడు బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు.అంతేకాదు పోలీసులు అడిగే ప్రశ్నలకు బబుల్ గమ్ తింటూ మరీ తాపీగా సమాధానాలు చెబుతూ పోలీసులే షాక్ అయ్యేలా చేసాడు.

Telugu Minor Boy Bike Driving At Warangal He Give Shocking Answers To Traffic Police, Minor Boy Driving Bike, Minor Driving Bike, Warangal Minor Boy, Warangal Minor Shocking Answer-Latest News - Telugu

ఈ ఘటన వరంగల్ లో జరిగింది.ఒక మైనర్ బాలుడు టూ వీలర్ బైక్ మీద వెనుక మరొక పిల్లాడిని కూర్చో పెట్టుకుని బైక్ నడుపుతూ పోలీసులకు దొరికాడు.కానీ ఆ బాలుడు మాత్రం పోలీసులు అడిగే ప్రశ్నలకు బబుల్ గమ్ నములుతూ తాపీగా సమాధానాలు చెప్తూ ఉంటే పోలీసులు సైతం ఆశ్చర్య పోయారు.ఆ బుడ్డోడు నేను ఎలెక్ట్రికల్ బైక్ డ్రైవ్ చేస్తున్నానని హెల్మెంట్ అవసరం లేదని.

గ్రీన్ కార్డు ఉందని అందుకే తనను వదిలి పెట్టాలని పోలీసులకు తెలిపాడు.

దీంతో పోలీసులు ఆ మైనర్ బాలుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తల్లిదండ్రులకు సమాచారం అంధించారు.

అంతేకాదు వారు వచ్చిన తర్వాత పోలీసులు వాళ్లకు వాళ్ళ స్టైల్ లో మర్యాదలు చేసి జరిమానా కూడా విధించారు.ఇప్పటికైనా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వక పోవడం మనకు మన చుట్టూ పక్కల వారికీ అందరికి మంచిది.

#WarangalMinor #MinorBoy #MinorBoy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు