జార్జ్‌ఫ్లాయిడ్ నేలకొరిగిన చోటే.. పోలీస్ తూటాకు మరో నల్లజాతీయుడు బలి, మిన్నంటిన నిరసనలు

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ భారీ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.

 Minneapolis Police Shoot Dead Black Man 16km From Where George Floyd Was Killed-TeluguStop.com

కానీ ఆచరణలో ఇది అంతా ఎండమావిగానే కనిపిస్తుందన్నది విజ్ఞుల మాట.ఓ ప్రయోజనం, ఓ సంకల్పం నుంచి పుట్టిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దేశంలోని ఈ వివక్షను కళ్ళప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోతోంది.ఇది అమెరికా సమాజానికి తలవంపులు తెచ్చే వ్యవహారమే.అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో నల్లజాతీయుల పట్ల నేటీకీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు.శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటీకీ అక్కడ ద్వీతీయశ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.ఇక గతేడాది జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య అయితే నిలువెత్తు నిదర్శనం.

ఫ్లాయిడ్‌ను ఓ తెల్లజాతి పోలీసు కర్కశంగా హతమార్చిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది.ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.

 Minneapolis Police Shoot Dead Black Man 16km From Where George Floyd Was Killed-జార్జ్‌ఫ్లాయిడ్ నేలకొరిగిన చోటే.. పోలీస్ తూటాకు మరో నల్లజాతీయుడు బలి, మిన్నంటిన నిరసనలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో పోలీసు తూటాకు మరో నల్లజాతీయుడు బలయ్యాడు.

అది కూడా జార్జ్‌ఫ్లాయిడ్ ఎక్కడైతే శ్వేతజాతి దురహంకారానికి నేలకొరిగాడో అదే మినియాపోలీస్ నగరంలో కావడం గమనార్హం.దీంతో దేశంలో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి.వివరాల్లోకి వెళితే.స్నేహితురాలితో కారులో వెళ్తున్న 20 ఏళ్ల డాంటే రైట్ అనే యువకుడిపై ఓ పోలీసు అధికారి కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

జార్జ్‌ఫ్లాయిడ్‌ ప్రాణాలొదిలిన ప్రదేశానికి 16 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది.విషయం తెలుసుకున్న వేలాది మంది నల్లజాతీయులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ.పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.అయితే డాంటే రైట్ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడని.

దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.కానీ ఆ యువకుడు.

దానికి నిరాకరించడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారి అతనిపై కాల్పులు జరిపినట్టు వివరించారు.ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

-Telugu NRI

కాగా, శ్వేతజాతి పోలీసుల అరాచకానికి బలైన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది.మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.

తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.

వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు