అమెరికాలో మిన్నియాపాలిస్ లో పోలీసు వ్యవస్థ రద్దు..!!!

అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో పోలీసు వ్యవస్థని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అక్కడి కౌన్సిల్ మీడియాకి ఈ సమాచారం అందించింది.

 Minneapolis Dismantle Its Police Department, Minneapolis,police Department, Us,-TeluguStop.com

నల్ల జాతీయుల నిరసనలు వారి యొక్క ఆవేదనను అర్ధం చేసుకున్న కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కౌన్సిల్ సభ్యులు తెలిపారు.ఈ తాజాగా నిర్ణయంతో స్థానికంగా ఉన్న నల్లజాతీయులు సంతోషం వ్యక్తం చేశారు.

కౌన్సిల్ కి కృతజ్ఞతలు ప్రకటించారు.

మే 25 నల్లజాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ ఘటన అందరికి తెలిసిందే.

మోకాలి కింద అతడి మెడను తొక్కి పట్టి ఊపిరి ఆడకుండా చేసి అమెరికా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించిన తీరును ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది ఈ ఘటనతో నల్లజాతీయులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగింది మిన్నియాపాలిస్ లో కావడంతో ప్రతీ రోజు అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు రేగుతూనే ఉన్నాయి.

నల్లజాతీయులు కూడా మనుషులే చంపబడిన వారికి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు…ఈ క్రమంలోనే

మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్ పోలీసు వ్యవస్థని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది.ఇందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

దీనికి ప్రత్యామ్నాయంగా సామాజిక ప్రజా రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది.అందుకు సంభందించిన విధి విధానాలు సిద్దమవుతున్నాయని తెలిపింది.

పోలీసు వ్యవస్థని రద్దు చేయడానికి గల ప్రధాన కారణం వారిలో పెరిగిపోతున్న జాతి వివక్ష విభేదాలు కారణమని తెలిపింది కౌన్సిల్.స్థానిక పౌరులకి సరికొత్త వ్యవస్థలో అవకాశం కల్పించనున్నట్టుగా ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube