చూశారా.. ఆ మంత్రి ఆర్టీసీని ఎంత ప‌ని చేశారో?!

అస‌లే ఆర్థ‌క క‌ష్టాలు, న‌ష్టాల‌తో కునారిల్లుతున్న ఏపీఎస్ ఆర్టీసీకి రాష్ట్ర కేబినెట్ మంత్రే ఒక‌రు ఎర్త్ పెడుతున్నార‌ట‌! లాభాలోచ్చే రూట్ల‌లో బినామీ పేరుతో దాదాపు 400 అధునాత బ‌స్సులు తిప్పేందుకు ఇప్ప‌టికే రంగం సిద్ధం చేసుకున్నార‌ట‌! ఈ విష‌యంలో ఆర్టీసీ అధికారులు ఏం చేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా.స‌ద‌రు మంత్రివ‌ర్యులు సీఎం చంద్ర‌బాబుకి అత్యంత స‌న్నిహితులు కావ‌డం, రాజ‌ధాని ప్రాంతంలో ఆయ‌న చెప్పిందే వేదంగా మారిపోతుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌.

 Ministers Eye On Apsrtc-TeluguStop.com

ఇప్ప‌టికైతే.అమాత్యుల వారి బినామీ బ‌స్సులు రోడ్ల‌పై రివ్వున దూసుకుపోవ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంద‌ట‌! మ‌రి ఆ సంగ‌తేంటో చూద్దాం.

ఉమ్మ‌డి ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో విద్యా సంస్థ‌లు స్థాపించి పెద్ద ఎత్తున కోట్లు కూడ‌బెట్టిన ఓ ప్ర‌ముఖ విద్యావేత్త స‌డెన్‌గా యూట‌ర్న్ తీసుకుని టీడీపీ తీర్థం పుచ్చుక‌న్నారు.దీనికి ముందు విప‌క్షంలో ఉండ‌గా ఆ త‌ర్వాత ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ టీడీపీ భారీ ఎత్తున అన్ని విధాలా సాయం కూడా చేశార‌ట ఆయ‌న.

దీంతో కృత‌జ్ఞ‌తా పూర్వ‌కంగా ఉంటుంది క‌దాని టీడీపీ సార‌ధి చంద్ర‌బాబు స‌ద‌రు విద్యావేత్త‌ను ప‌ద‌వి ఇచ్చి ప‌క్క‌న కూర్చోబెట్టుకోవ‌డమేకాకుండా పెద్ద ఎత్తున బాధ్య‌తులు కూడా అప్ప‌గించారు.అయితే, ఎన్ని బాధ్య‌తలు అప్ప‌గించినా.

ఎంత బిజీగా ఉన్నా.వ్యాపార రంగం నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి వ్యాపారంపైనే క‌న్నుంటుంది క‌దా!!

అదే క్ర‌మంలో ఈ విద్యావేత్త‌కి కూడా రాష్ట్రంలో లాభ‌దాయ‌కమైన రంగంలోకి ప్ర‌వేశించాల‌ని మ‌న‌సు పుట్టింది.

దీంతో ఆయ‌న‌కు క‌ల్ప‌వృక్షం మాదిరిగా ర‌వాణా రంగం క‌నిపించింద‌ట‌.ఇంకేముంది.

అస‌లే త‌ల‌బొప్పిక‌ట్టి ఉన్న ఆర్టీసీకి నేనో నాలుగు మొట్టికాయ‌లు వేస్తే.పెద్ద పోయేదేం లేద‌ని అనుకుని.ఆర్టీసీకి అత్యంత లాభ‌దాయ‌క మార్గాలైన నెల్లూరు – కడప – అనంతపురం – కర్నూలు జిల్లాల్లో హైటెక్ బస్సులూ ఆయనకు చెందినవే.‘చెన్నరు- విజయవాడ’ – ‘విజయవాడ – విశాఖపట్నం’ – ‘విజయవాడ – హైదరాబాద్’ – ‘విజయవాడ – బెంగుళూరు’ – ‘విజయవాడ – మధురై రూట్ల‌లో దాదాపు 400 బ‌స్సులు డంప్ చ‌య‌డానికి రెడీ అయిపోయార‌ట‌.

దీనికి ఆయ‌న నేరుగా రంగంలోకి దిగితే.పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని భావించి.త‌న విద్యా సంస్థ‌ల బ‌స్సుల‌కు మెకానిక్‌.త‌ర్వాత మేనేజ‌ర్ అయిన తెలంగాణ‌కు చెందిన ఓ ప్ర‌ధాన అనుచ‌రుడితో గ్లోబ‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ‌ను స్థాపించార‌ట‌.

దీనిద్వానా అమాత్యుల వారు పెద్ద ఎత్తున ప్రైవేటు బ‌స్సులను రంగంలోకి దింపుతున్నార‌ట‌.దీనికి సంబంధించిన టెండ‌ర్ ఇప్ప‌టికే ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం.

ఏదేమైనా.తిన్నింటి వాసాలు లెక్క‌పెట్ట‌డం అంటే ఇదే న‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్య‌క్తి ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డం మానేసి.అవ‌కాశం వాదంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఏంట‌నే టాక్ వ‌స్తోంది.

మ‌రి దీనిపై సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube