సుజాత‌కు పొగ పెడుతోన్న మంత్రి ఎవ‌రు..!

చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క‌మైన గ‌నుల శాఖ మంత్రిగా ఉన్న పీత‌ల సుజాత‌కు అదే కేబినెట్‌లో సీఎంకు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న మ‌రో మంత్రి పొగ‌పెడుతున్నార‌ట‌! ప్ర‌స్తుతం ఈ టాపిక్ మీదే అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.వాస్త‌వానికి సుజాత మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.

 Ministers Angry On Peethala Sujatha Fraud Business-TeluguStop.com

కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు.ఒంగోలులో జ‌రిగిన స‌న్మానంలో మంత్రి వ‌డ్డాణం తీసుకున్నార‌ని, అలాగే.

గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగిన ఓ స‌న్మానంలో భారీ ఎత్తున కానుక‌లు స్వీక‌రించార‌ని మంత్రిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఇక‌, ఓ మ‌హిళ నేరుగా రూ.10 ల‌క్షల బ్యాగుతో మంత్రి సుజాత ఇంటివ‌ద్దే మీడియా కంట ప‌డ‌డం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది.రాష్ట్రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన ఉచిత ఇసుక అంశంలోనూ మంత్రి భారీగా ముడుపులు స్వీక‌రించార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇక‌, ఇప్పుడు తాజాగా క‌ర్నూలులోనూ మంత్రికి ముడుపులు అందాయ‌ని స‌మాచారం.ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టి నుంచో మంత్రికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.అయితా, తాజా న్యూస్ ప్ర‌కారం ఇక‌, ఈ మంత్రిని ఎట్టిప‌రిస్థితిలోనూ కేబినెట్‌లో ఉంచ‌రాద‌ని సీఎంకు స‌న్నిహితంగా ఉండే మ‌రో మంత్రి చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచుతున్నార‌ట‌.

అదేవిధంగా ప‌శ్చిమ గోదావ‌రిలో.

సుజాత‌పై అసంతృప్తిగా ఉన్న సొంత పార్టీ టీడీపీ నేత‌లు సైతం ఈమెను ఇక మంత్రిగా కొన‌సాగించ‌రాద‌ని బాబుపై ఒత్త‌డి పెంచుతున్నార‌ట‌.ఈ క్ర‌మంలో సుజాత‌కు మార్పు త‌థ్య‌మ‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే మంత్రి పీత‌ల స్థానంలో విశాఖ జిల్ల పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని కూడా ఈ మంత్రిగారు బాబుకు సూచిస్తున్నార‌ట‌.ఈ మేర‌కు స‌ద‌రు మంత్రి గారు అనిత‌కు హామీ ఇచ్చిన‌ట్టు కూడా తెలుస్తోంది.

దీంతో సుజాతకు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే టాక్ పెద్ద ఎత్తున న‌డుస్తోంది.త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సుజాత పోస్ట్ బాబు పీకేస్తార‌ని తెలుస్తోంది.

అయితే, అనిత‌కు ఛాన్స్ ఉంటుందా? ఉండ‌దా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube