వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ స్పీక‌ర్‌... ఆట మొద‌లైంది..!

వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ స్పీక‌ర్ మ‌ధ్య ఆట మొద‌లైంది.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి, డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వ‌ర్సెస్ స్పీక‌ర్ మ‌ధ్య ఇప్పుడు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌లేచింది.

 Minister Vs Speaker Fight In Ysrcp... Game Starts, Tammineni Seetha Ram, Ministe-TeluguStop.com

జిల్లా నుంచి ముందు మంత్రిగా కృష్ణ‌దాస్ ఒక్క‌రే ఉండేవారు.ఆ త‌ర్వాత సీదిరి అప్ప‌ల‌రాజు కూడా మంత్రి అయ్యారు.

మ‌రో ప‌ది నెలల్లో జ‌రిగే మార్పులు, చేర్పుల్లో కృష్ణ‌దాస్ ప్లేస్‌లో తాను మంత్రి అవ్వాల‌ని స్పీక‌ర్ త‌మ్మినేని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

Telugu Ap, Game, Hot, Latest, Tammineniseetha, Ysrcp-Telugu Political News

త‌న ప‌ద‌విపై గురి పెట్టిన త‌మ్మినేనిపై కృష్ణ‌దాస్ గుస్సాతో ఉన్నారు.త‌న చాప‌కింద‌కు నీరు రాకుండా ఆయ‌న త‌న జాగ్ర‌త్త‌లు తాను తీసుకుంటున్నారు.మ‌రో వైపు కృష్ణ‌దాస్‌ను ఎలా త‌ప్పిస్తారా ?  తాను ఎప్పుడు మంత్రిని అవుతానా ? అని త‌మ్మినేని కాచుకుని ఉన్నారు.ఈ వార్ ఇలా ఉండ‌గానే ఇద్ద‌రి మ‌ధ్య మ‌రో గేమ్ స్టార్ట్ అయ్యింది.విద్యార్థి ద‌శ‌లో ఉన్న‌ప్పుడు వీరిద్ద‌రు మంచి ఆట‌గాళ్లుగా గుర్తింపు పొందారు.తాజాగా శ్రీకాకుళం జిల్లాకు మంజూరు అయిన క్రికెట్ స్టేడియాన్ని ఆముదాలవ‌ల‌స‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న ప్రాంతానికి త‌ర‌లించుకుపోయారు.

Telugu Ap, Game, Hot, Latest, Tammineniseetha, Ysrcp-Telugu Political News

ఇది స్పీక‌ర్ నియోజ‌క‌వర్గంలో ఉంది.ఇది మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు న‌చ్చ‌డం లేద‌ట‌.తానున్న మంత్రివ‌ర్గంలో త‌న‌కు తెలియ‌కుండానే ఫైల్ క‌దిలించి.

ప‌ని కానిచ్చేశార‌ని ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు.అంతే కాకుండా జిల్లా కేంద్ర‌మైన శ్రీకాకుళంలోనే స్టేడియం ఉండాలి గాని.

ఆముదాల‌వ‌ల‌స‌లో ఎలా పెడ‌తార‌ని ఆయ‌న అగ్గిమీద గుగ్గిలం అవుతున్నార‌ట‌.ఎలాగైనా స్టేడియాన్ని శ్రీకాకుళంకు షిఫ్ట్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌.

చివ‌ర‌కు ఈ విష‌యం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు పంచాయితీ వ‌ద్ద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.మ‌రి జ‌గ‌న్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి వైపు మొగ్గు చూపుతారో ?  చూడాలి.ఇద్ద‌రు ఆయ‌న‌కు అత్యంత ఇష్టులే కావ‌డంతో ఈ గేమ్‌లో ఎవ‌రు గెలుస్తారా ? అన్న చ‌ర్చ‌లు సిక్కోలులో వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube