బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం నాడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:10వ తరగతి పేపర్ లీక్ సూత్రదారి బీజేపీ బండి సంజయే అన్ని రకాల ఆధారాలు లభించాయి లక్షల మంది పిల్లలు భవిష్యత్తు,వారి తల్లి తండ్రుల ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడు కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపిండు పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా వచ్చింది బండి సంజయ్,బీజేపీ వాళ్ళతో 140 సార్లు ఫోన్లో మాట్లాడిండు ప్రశాంత్ వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తారు…వాళ్లే మీడియాకి పంపిస్తారు.పేపర్ లీక్ అయ్యింది.
ఆ పేపర్ నాకు వచ్చింది.ప్రభుత్వం విఫల మయ్యింది అని ప్రచారం చేస్తారు.
ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమే బండి సంజయ్ పాత్ర ఉన్నది పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి.చట్టం తనపని తాను చేసుకుపోతుంది బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్…భౌతిక దాడులు తప్పవు పేపర్ లీక్ చేసి పిల్లల భవిష్యత్ ను నాశనం చేయాలని చూసిన బీజేపీ బండి సంజయ్ వైఖరి పట్ల బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలి.







