జానారెడ్డి పై మంత్రి తలసాని సంచలన కామెంట్స్.. ?

తెలంగాణ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపధ్యం లో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్దాయికి చేరుకుంటుంది.ఈ క్రమంలో సాగార్ నుండి కాంగ్రెస్ తరపున జానారెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

 Minister Talasani's Sensational Comments On Janareddy Telangana, Minister Talas-TeluguStop.com

కాగా టీఆర్ఎస్ తరపున పోటీలోకి నోముల భగత్ కుమార్ యాదవ్ నిలుచుండగా ఇతని తరపున ప్రచారంలో పాల్గొన్న తలసాని జానారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి దారుణంగా ఓడిపోతున్నాడని, ఆయన గౌరవం ఈ ఎన్నికతో గంగలోకి పోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక తానూ సాగర్‌లో వేసిన నామినేషన్ హుందాగా విత్‌డ్రా చేసుకుని దివంగత నోముల నర్సింహయ్య కుటుంబానికి సహకరిస్తే కొంతైనా గౌరవం ఇచ్చిన వారవుతారని వ్యాఖ్యానించారు.ఇన్నాళ్లు జానారెడ్డి ప్రజలను మభ్యపెట్టి గెలుస్తూ వస్తున్నాడని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని, నోముల భగత్ వెంట సీఎం కేసీఆర్ ఉన్నారని, సాగర్ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube