దిల్‌రాజును టార్గెట్‌ చేసిన తెలంగాణ మంత్రి... అసలు సంగతి ఏంటి?

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తాజాగా ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మహర్షి చిత్రంకు తెలంగాణ మరియు ఏపీలో మొదటి వారం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరడం జరిగింది.

 Minister Talasani Sinivas Targets Dil Raju-TeluguStop.com

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్లకు అనుమతించలేదు.ప్రభుత్వం అనుమతి లభించిందని మొదట చిత్ర యూనిట్‌ సభ్యులు మొదట ప్రచారం చేశారు.

అయితే అనూహ్యంగా మంత్రి తలసాని స్పందిస్తూ తమ నుండి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, అసలు సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, థియేటర్ల యజమానులు టికెట్ల రేట్లు పెంచి అమ్మితే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.

టికెట్ల రేట్లు పెంచాలని నిర్ణయించుకున్న థియేటర్ల యాజమాన్యం మంత్రి ఆదేశాలతో ఒక్కసారిగా వెనక్కు తగ్గడం జరిగింది.

మంత్రి రివర్స్‌ అవ్వడంతో నిర్మాత దిల్‌రాజు హైకోర్టుకు వెళ్లి మరీ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.తాజాగా హైకోర్టు దిల్‌రాజు రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయడం జరిగింది.

అయితే మంత్రి ఎందుకు అనుమతించలేదు అనే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

దిల్‌రాజును టార్గెట్‌ చేసిన �

సినీ వర్గాల్లో అందుతున్న గుసగుసలు ప్రకారం తెలంగాణ ప్రభుత్వంకు చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందాల్సిన మామూళ్లు అందలేదని, అందుకే వారు ఇందుకు నో చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం నుండి నిర్మాతలు భారీ లాభాలు దక్కించుకున్నారు.అందుకే అందులో కాస్త అడిగి ఉంటారు అనేది కొందరు చెబుతున్న వాదన, కాని అది ఏమాత్రం నిజం అయ్యి ఉండదు.ఎందుకంటే ప్రజలపై భారం వద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచేందుకు ఒప్పుకోలేదు.30 శాతం టికెట్ల రేట్లు పెంపు అంటే ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే 1500 రూపాయలు ఖర్చు.అందుకే ప్రభుత్వం నో చెప్పి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube