తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హెచ్చరిక.. ?

కరోనా రావడం ఎంటో గానీ ప్రజలు బికారుల్లా మిగిలిపోతుండగా ప్రైవేట్ హస్పటల్ వాళ్లు మాత్రం కోట్లకు పడగలు ఎత్తుతున్నారు.ఈ కోవిడ్ వల్ల బ్లాక్ దందా వ్యవహారం జోరుగా చేస్తున్నారు.

 Telangana Minister Srinivas Gowd Warns Private Hospitals, Telangana, Minister, S-TeluguStop.com

డబ్బులు కట్టిన వారికే ట్రీట్‌మెంట్.

మరి గరిబోళ్ల పరిస్దితి కాటికే అనేలాంటి పరిస్దితులను ఈ కరోనా కల్పించింది.

వైద్యానికి ఊహించని డిమాండ్ ఉన్న ఈ రోజుల్లో కరోనా వచ్చిన వారికి హాస్పటల్లో బెడ్ దొరికితే గోల్డ్ మెడల్ సాధించినంత ఆనందపడిపోతున్నారు.ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 20 శాతం బెడ్లు తప్పనిసరిగా కేటాయించాలని, లేదంటే ఆ ఆస్పత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హెచ్చరించారు.

అదీగాక ఇక నుండి ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్ల నుంచి వసూలు చేసే బిల్లులు, వారికి కల్పిస్తున్న సేవలపై తాము ఏర్పాటు చేస్తున్న టాస్క్​ఫోర్స్‌‌ టీమ్‌‌ నిఘా పెడుతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube