తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి ఓ కార్యక్రమం నిర్వాహకులు నివ్వెరపోయారు.ఆ సందర్భంలో శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి అక్కడున్న వారితో పాటు నిర్వాహకులు సైతం నోరెళ్లబెట్టారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉంటారో ఆరోగ్యం విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు.తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ‘ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్’ ఎడిషన్లో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా పాల్గొన్న ఉత్సాహకులలో ఉత్సాహం నింపేందుకు ఏకంగా 50 డిప్స్ కొట్టారు.ఆగకుండా 50 డిప్స్ కొట్టి తనలోని ఆరోగ్యాన్ని కంటెస్టంట్స్కు చూపించిన మంత్రిని చూసి నిర్వాహకులు సైతం నోరెళ్లబెట్టారు.
అంతేగాక మంత్రి చేసిన పనికి ఆయన చేతిలో ఓ షీల్డ్ పెట్టి అభినందించారు.మంత్రి తన ఆరోగ్య ఫిట్నెస్ లాగా అందరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
ఆరోగ్యమే మహాబాగ్యం అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.