టూరిజం షార్ట్ ఫిల్మ్' ను ఆవిష్కరించిన మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్....

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రకృతి సహజంగా ఏర్పడిన అద్భుత పర్యాటక కేంద్రం సోమశిలపై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ రూపొందించిన టూరిజం షార్ట్ ఫిల్మ్’ను ఆవిష్కరించారు.

 టూరిజం షార్ట్ ఫిల్మ్’ ను ఆవి-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ లోని పర్యాటక కేంద్రాలను గత పాలకులు ఎంతో నిర్లక్ష్యం చేశారన్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న పర్యాటక కేంద్రాలైన KCR ఎకో అర్బన్ పార్క్, మన్యం కొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పిల్లల మర్రి, ఉమా మహేశ్వరం, అక్క మహాదేవి గుహలు, ఫర్హా బాద్, సింగోటం, సోమశిల లాంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాలతో పాటు కృష్ణ నది తీరం వెంట ఉన్న ప్రకృతి సహజంగా ఏర్పడిన ఎన్నో సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు తగిన ప్రచారం కల్పించి పర్యాటకులను రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు./br>

పర్యాటక ప్రదేశాల విశిష్టత పై ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ గారి నేతృత్వంలో టూరిజం షార్ట్ ఫిల్మ్ లను రూపొందించి తగిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, ఉద్యోగుల సంఘం నాయకులు మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube