పవన్ కళ్యాణ్ ది యాక్షన్ అయితే చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారని మండిపడ్డ మంత్రి సీదిరి అప్పలరాజు..

శ్రీకాకుళం: పవన్ కళ్యాణ్ ది యాక్షన్ అయితే చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ కు స్వతహాగా వ్యాఖ్యలు చేసే జ్ఞానం లేదని అన్నారు.

చంద్రబాబుకు తమ జన్మభూమి కమిటీల మీద తప్ప సచివాలయ వ్యవస్థపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను వేధించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో తెలుసుకోలేకపోయారని అన్నారు.బాబు 14 ఏళ్ల పాలనలో గుర్తుపెట్టుకున్నటువంటి పథకం ఒక్కటి కూడా లేదని తెలిపారు.

అదే రాజశేఖర్ రెడ్డి హయాంలో 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రజలకు సంజీవనిలా పని చేశాయని అన్నారు.ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవో తమకు తెలుసని ఇప్పటి ప్రభుత్వ పాఠశాలను చూస్తే తమకు గర్వంగా ఉందని తెలిపారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు