మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆర్కే రోజా

కృష్ణా జిల్లా మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.కృష్ణా జిల్లాలో మహా నాయకులు, స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది జన్మించారు.

 Minister Rk Roja Hoisted National Flag At Machilipatnam Police Parade Ground Det-TeluguStop.com

భారతావని బానిసత్వపు సంకెళ్లను వీడి, స్వతంత్ర స్వేచ్ఛ వాయువును పీల్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆగస్టు 15ను వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కృష్ణా జిల్లాలో జరుపుకుంటున్నారు.

మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నందు రాష్ట్ర పర్యాటక సంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖా మాత్యులు ఆర్కే రోజా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.

దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను వారి స్ఫూర్తిని ఆమె వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కృష్ణాజిల్లాలో అమలు జరుగుతున్న పథకాలను గురించి మంత్రి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, ఎస్పీ జాషువా, తదితర అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube