గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియానికి శంకుస్థాపన చేసిన మంత్రి పుష్పశ్రీవాణి

ఆంధ్ర కశ్మీర్ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి ప్రాంతంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం, లంబసింగికి సమీపంలో తాజంగి గ్రామం వద్ద రూ.35 కోట్ల వ్యయంతో మ్యూజియానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు.కేంద్ర ప్రభుత్వం లంబసింగిలో స్వాతంత్ర్య సమరయోధులు మ్యూజియం ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సంకల్పించింది.తొలుత లంబసింగి టూరిజం రిసార్ట్స్ సమీపంలో వున్న స్థలాన్ని ఇందుకోసం రెవెన్యూ అధికారులు కేటాయించారు.

 Minister Pushpasrivani Laid The Foundation Stone For The Museum Of Tribal Freedo-TeluguStop.com

కానీ స్థానిక గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజంగి వద్ద వున్న డెయిరీ ఫారం భూములు 22 ఎకరాలను ఎంపిక చేశారు.దీని నిర్మాణానికి సుమారు రూ.35 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.ఇందుకో రూ.15 కోట్లు కేంద్రప్రభుత్వం, రూ.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి , మ్యూజియం ప్రత్యేకతలు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన గిరిజన సమరయోధుల విగ్రహాలను ఏర్పాటుచేయడంతోపాటు వారిపూర్తి వివరాలను మ్యూజియంలో అందుబాటులో ఉంచుతారు.గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యాధునిక సదుపాయాలతో మ్యూజియం నిర్మాణం జరుగుతుంది.

మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులు ఉంటాయి.

నాటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి డిజిటల్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube