చిరంజీవిని అభినందించిన మంత్రి పేర్ని నాని..!!

ఏపీ సీఎం జగన్ తో మీటింగ్ అనంతరం సినిమా ప్రముఖులతో పాటు వైసీపీ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ చూస్తున్న పేర్ని నాని మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ని అభినందించారు.

 Minister Perni Nani Praises Chiranjeevi Chiranjeevi, Ys Jagan, Perni Nani, Tolly-TeluguStop.com

ఇక ఇదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.ఇండస్ట్రీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు రావటానికి చిరంజీవి ఎంతో కృషి చేశారని దానికి ఆయన పెద్ద మనసుకు కృతజ్ఞతలు అని అన్నారు.

ఇండస్ట్రీకి ఒక బిగ్ రిలీఫ్ తీసుకురావటానికి చిరంజీవి.అన్ని పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుని సానుకూలంగా సమస్యలను పరిష్కరించే రీతిలో వ్యవహరించారని ప్రభుత్వం తరఫున ఆయనను అభినందిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇక ఇదే సమయంలో హైదరాబాద్ మాదిరిగా ఏపీలో వైజాగ్ లో సినిమా షూటింగ్ లు జరిగే రీతిలో… జగన్ కోరడం జరిగిందని దానికి సినిమా ప్రముఖుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.ఇక చిన్న సినిమాల గురించి కూడా ఆర్ నారాయణ మూర్తి సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయంలో సినీ ప్రముఖులంతా.

కలిసి చర్చించుకుంటాం అని జగన్ కి తెలియజేశారని మంత్రి పేర్ని నాని సమావేశం గురించి మీడియా వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Perni Nani Praises Chiranjeevi Chiranjeevi, YS Jagan, Perni Nani - Telugu Chiranjeevi, Perni Nani, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube