అంత ఇబ్బంది అయితే 'బంగార్రాజు'ను వాయిదా వేసుకోమనండి

Minister Perni Nani About Bangarraju Movie Release

నాగార్జున మరియు నాగ చైతన్యలు హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ సినిమాలకు పోటీగా ఈ సినిమా వస్తుందని అంతా భావించారు.

 Minister Perni Nani About Bangarraju Movie Release-TeluguStop.com

కాని ఉత్తరాదిన కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ఆ సినిమా లు రెండు వాయిదా పడ్డాయి.దాంతో తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు కుమ్మేయడం ఖాయం గా భావించారు.

ఇదే విషయంలో తెలుగు బయ్యర్లు అంతా కూడా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.విడుదలకు మరో రెండు రోజుల గడువు ఉండగా అనూహ్యంగా ఏపీలో కర్ఫ్యూ ను విధిస్తున్నట్లుగా ప్రకటించారు.

 Minister Perni Nani About Bangarraju Movie Release-అంత ఇబ్బంది అయితే బంగార్రాజు’ను వాయిదా వేసుకోమనండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో థియేటర్ల వద్ద 50 శాతం ఆక్యుపేషన్ ను విధించే విషయమై నిర్ణయాన్ని తీసుకున్నారు.ఇటీవల కేసులు ఎక్కువ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి అన్నారు.

అయితే కొందరు మాత్రం టాలీవుడ్‌ కు వ్యతిరేకంగా తెలుగు సినిమా లపై కక్ష సాధింపుతోనే సంక్రాంతి సినిమాలపై ప్రభావం ఉండాలనే ఉద్దేశ్యంతో హడావుడిగా ఇలాంటి ఆంక్షలు పెట్టారు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో మంత్రి పేర్ని నాని ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.ఒక సినిమా కోసమో లేదా మరో కారణంతోనే ఇలాంటి ఆంక్షలు తీసుకు రాలేదు.నైట్‌ కర్ఫ్యూ అనేది సీఎం తీసుకున్న నిర్ణయం.ఆయన ఇతర రాష్ట్రాల పరిస్థితులు.పక్క రాష్ట్రంలో ఉన్న కేసులు ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

అంతే తప్ప ఒక్క సినిమా కోసమో లేదా టాలీవుడ్‌ పై కోపంతోనో ఈ నిర్ణయం తీసుకోలేదు అన్నాడు.ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ సినిమా లు వాయిదా వేశారు కదా.ఇబ్బంది అయితే బంగార్రాజు సినిమా ను కూడా వాయిదా వేసుకోమనండి అంటూ మంత్రి నాని సలహా ఇచ్చారు.మరి బంగార్రాజు టీమ్‌ ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.

#Perni Nani #Naga Chaitanya #Nagarjuna #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube