చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి..!!

నిన్న తిరుపతిలో చంద్రబాబు రోడ్ షోలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.దీంతో తమ పై రాళ్ల దాడి జరగడంతో చంద్రబాబు మరియు టిడిపి నాయకులు ప్రభుత్వంపై పోలీస్ వ్యవస్థ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

 Minister Peddireddy Serious Comments On Chandrababu-TeluguStop.com

అంతేకాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.దీనిపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

ఓటమి భయంతోనే చంద్రబాబు హై డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.సరిగ్గా 45నిమిషాల ప్రసంగం టైములో దాదాపు నలభై నిమిషాలకు పైగా చంద్రబాబు మాట్లాడారు.

 Minister Peddireddy Serious Comments On Chandrababu-చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరిలో రాళ్లదాడి జరిగిన దాని బట్టి చూస్తే కచ్చితంగా ఇది హైడ్రామా అంటూ ఆరోపణలు చేశారు.నీలాగా వైసిపి పార్టీ దిగజారుడు రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు.

చచ్చిన పాము లో కర్రతో కొట్టాల్సిన అవసరం ఏముంది అని అన్నారు.సొంత మామ పైన చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది.

అలాంటి అలవాటు జిల్లాలో ఎవరికీ లేదని పేర్కొన్నారు.నిన్న జరిగిన ఘటన జరిగిన వెంటనే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం చేసినట్లు ఉందని తెలిపారు.

ఇదే క్రమంలో రాయి వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, చట్ట పరంగా చంద్రబాబు అయినాసరే ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్లు పెద్ద రెడ్డి స్పష్టం చేశారు.రాజకీయాల్లో సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు అప్పట్లో అమిత్ షా పై రాళ్ల దాడి చేయడం జరిగింది అంటూ విమర్శించారు.

  

#Peddireddy #Chandrababu #Tirupathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు