ఏపీలో వసూళ్ల మంత్రి ? ఎవరు ఆయన ఏంటి కథ ?  

Minister Of Revenue In Ap? Who\'s His Story? - Telugu Chandrababu Naidu, Janasena, Lokesh, Minister Of Revenue, Pawan Kalyan Janasen, Roja, Shankar Narayana, Tdp, Ys Jagan, Ysrcp, వసూళ్ల మంత్రి

తన పరిపాలన లో అవినీతికి ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ భావించడమే కాకుండా, దానికి తగినట్టుగా కఠినమైన నిబంధనలు రూపొందించి ప్రభుత్వ శాఖల్లో అవినీతి వ్యవహారాలను కట్టడి చేస్తూ ఎవరైనా లంచాలు అడిగితే తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఇచ్చాడు.అలాగే ఏసీబీని కూడా మరింత పటిష్టం చేయడంతో పాటు మరిన్ని అధికారాలు వాటికి కట్టబెట్టాడు.

Minister Of Revenue In Ap? Who's His Story?

ఎక్కడా అవినీతి అనేది లేకుండా చేయాలని జగన్ పదే పదే చెబుతున్నాడు.ఇటువంటి సమయంలో జగన్ క్యాబినెట్ లోని ఓ మంత్రి వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

దీంతో ప్రభుత్వంతో పాటు, వైసీపీ నాయకులు చాలామంది ఉలిక్కిపడ్డారు.

జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ కు వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతూ వైరల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మంత్రికి వ్యతిరేకంగా ‘ వసూళ్ల నారాయణ’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో రంగంలోకి దిగిన మంత్రి అనుచరులు ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని, ఈ పోస్ట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లాలోని కియా పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు పెనుకొండ మండలం వెంకటగిరి పాలేనికి చెందిన శ్రీధర్ రెడ్డి దీనికి కారణమని గుర్తించి ఆయనపై కేసు నమోదు చేసారు.

మంత్రి శంకర్ నారాయణ గురించి చెప్పుకుంటే 2019 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి బీకే పార్థసారథి పై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.అనంతపురం జిల్లా, సామాజిక ఈ పరిస్థితుల్లో శంకర్ నారాయణ మంత్రిగా జగన్ అవకాశం కల్పించి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు.తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది కావాలని నాపై ఈ విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, మంత్రి ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తున్నారు.అయితే వసూళ్ల మంత్రి అనే పోస్టింగ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది.

ఇకపై ఈ విధంగా ఎవరైనా అసత్య కథనాలు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

తాజా వార్తలు

Minister Of Revenue In Ap? Who\'s His Story?-janasena,lokesh,minister Of Revenue,pawan Kalyan Janasen,roja,shankar Narayana,tdp,ys Jagan,ysrcp,వసూళ్ల మంత్రి Related....