ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన మంత్రి మ‌ల్లారెడ్డి.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు..

టీఆర్ ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డికి రెచ్చిపోయి మాట్లాడ‌టం కొత్తేమీ కాదు.గ‌తంలో కూడా చాలాసార్లు ఆయ‌న ఇదే విధంగా రెచ్చిపోయి మ‌రీ వ్యాఖ్య‌లు చేయ‌డంతో చాలాసార్లు న‌వ్వుల పాల‌య్యారు.

 Minister Mallareddy Provoked In A Range Over Revanth Reddy, Mallareddy, Revanth,-TeluguStop.com

ఇంకొన్ని సార్లు అయితే ఏకంగా కేసీఆర్ కూడా సీరియ‌స్ అయిన‌ట్టు అప్ప‌ట్లో వార్తలు కూడా వ‌చ్చాయి.అయితే మొద‌టి నుంచి ఎంపీ రేవంత్ రెడ్డికి అలాగే మంత్రి మ‌ల్లారెడ్డికి మ‌ధ్య వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో మ‌ల్లారెడ్డి అల్లుడి మీద రేవంత్ రెడ్డి పోటీ చేసి ఎంపీగా గెల‌వ‌డంతో అప్ప‌టి నుంచే ఇద్ద‌రి మ‌ధ్య వైరం మొద‌లైంది.

ఇక వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా మ‌ల్లారెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు రేవంత్ రెడ్డి.

ఇక ఇందులో భాగంగా నిన్న సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో నిన్న‌ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండో రోజు దీక్ష సంద‌ర్భంగా పెద్ద స‌భ నిర్వ‌హించి అనేక ఆరోప‌ణ‌లు మంత్రి మల్లారెడ్డిపై చేశారు.దీంతో త‌న మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలకు జెట్ స్పీడ్ తో రియాక్షన్ ఇచ్చేశారు మంత్రి మ‌ల్లారెడ్డి.

గ‌తంలో ఆయ‌న ఇప్పటివరకు తిట్ట‌ని తిట్లతో రేవంత్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.ఏకంగా మీడియా ముందే తొడ కొట్టి మ‌రీ భారీ సవాలు విసిరారు మ‌ల్లారెడ్డి.

Telugu Cm Kcr, Mallareddy, Malla, Mallarevanth, Revanth, Ts-Telugu Political New

త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని, రేవంత్ కూడా త‌న టీపీసీసీ ప‌ద‌వికి అలాగే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి త‌న‌పై పోటీ చేసి గెల‌వాల‌ని డిమాండ్ చేశారు.అయితే ఈ సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మ‌రీ తిట్ల దండకాన్ని ఎత్తుకోవ‌డ‌మే ఇప్పుడు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.ఇంకేముంది నెటిజ‌న్లు ఆయ‌న్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి డైలాగులు, తిట్లు ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా మొత్తం దీని గురించే ట్రోలింగ్ న‌డుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube