టీఆర్‌ఎస్‌ నేతలకూ మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక.. ఎందుకోసమంటే.. !?

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి వేసవిని మరిపించేలా సాగుతుంది.ఈ పొలిటికల్ హీట్ వల్ల నాయకులకు చెమటలు పడుతున్నాయట.

 Ktr, Meeting, Graduate, Mlc Elections, Trs Leaders-TeluguStop.com

కాగా ఇప్పటికే కారుగుర్తు టెర్లు పంక్చర్ చేయాలని కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరిగా ప్రణాళికలు రచిస్తుండగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై జోరుగా చర్చలు కూడా టీఆర్ఎస్‌లో సాగుతున్నాయట.

ఈ రసవత్తర పోరులో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనే ఇస్తున్నాయని తెలుస్తుంది.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో నిన్న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌లోని కొంతమంది నేతల తీరుపై కేటీఆర్‌ సీరియస్‌ అవుతూనే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

అందరూ కలిసి ప్రచారం చేసి ప్రతిపక్షాల నోర్లు మూయించాలని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇకపోతే దుబ్బాకలో ఓటమి అందుకున్నప్పటి నుండి తెలంగాణ ప్రజల్లో గులాభి పార్టీపట్ల వ్యతిరేకత మొదలైందని, దీనికి తోడుగా బండి సంజయ్ గాలితో ఇది మరింతగా ప్రచారంలోకి వెళ్లిందని భావిస్తున్న కేటీఆర్ ఈ సారి ఓడిపోతే పరువుపోతుందనే ఆందోళనతో ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అందుకోవాలనే ఉద్దేశ్యంతో క్రమశిక్షణ తప్పుతున్న పార్టీ నేతలను ఈ విధంగా మందలిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube