ప్రజల పాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యం -కేటీఆర్

ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.బుద్ధభవన్ లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

 Minister Ktr, Muncipality, Adhilabad, Minister Indra Karan Reddy,cm Kcr,-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కొనేరు కోణప్ప, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్ లు, పురపాలక శాఖ కమిషనర్లు హాజరయ్యారు.మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై  మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని.ఆ దిశగా పరిపాలన వికేంద్రీకరణ చేశారని సూచించారు.మున్సిపాలిటీల అభివృద్ధికి ఓ అభివృద్ధి నమూనాను తయారు చేసుకోవాలని కేటీఆర్ చెప్పారు.

పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి కనీస అవసరాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులను అమలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్కులు అందించాలని అధికారులకు ఆదేశించారు.అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలని.

వాటిలో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube