ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్..!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లై ఓవర్ ను సోమవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఇన్నర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు బైరామల్‎గూడ జంక్షన్‎లో ఫ్లై ఓవర్‎ను నిర్మించారు.

 Minister Ktr, Minister Sabitha Indra Reddy, Hyderabad Traffic, Mayor Bonthu Ramm-TeluguStop.com

ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

బైరామల్‎గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‎ను ఎస్ఆర్‎డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా 784 మీటర్ల పొడవు బ్రిడ్జిని రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించారు.ఎస్ఆర్‎డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ.448 కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన 14 పనులలో ఇప్పటికే ఆరు పూర్తి కాగా, మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్బీనగర్ జంక్షన్‎లో నిర్మించిన అండర్ పాస్, బైరామల్‎గూడ, నాగోలు కామినేని చౌరస్తా, చింతల్ కుంట అండర్ పాస్‎లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

కాగా, బైరామల్‎గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు.ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొదటిసారి స్లాబ్స్, క్రాష్ బారియర్స్, ఫిక్షన్ స్లాబుల నిర్మాణంలో ఆర్‎సీసీ ఫ్రీకాస్ట్ టెక్నాలజీని వినియోగించారు.

ఇక ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బైరామల్ గూడ జంక్షన్, సాగర్ రోడ్ జంక్షన్‎లలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube