ఆ నియోజకవర్గం అంటే కేటీఆర్ కు హడల్ ? ఎందుకంటే ?

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.  త్వరలోనే టీఆర్ఎస్ కీలక బాధ్యతలను స్వీకరించ బోతున్నారు.

 Minister Ktr Fear On Hujurabad Constency-TeluguStop.com

ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఉందని చాలా రోజులనుంచి వినిపిస్తూనే ఉంది.దీనికి తగ్గట్లుగానే పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సంపాదించుకున్నారు.

ఎక్కడ ఎన్నికలు జరిగినా , కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నారు.అక్కడ గెలుపు కూడా దొరుకుతూ ఉండడంతో కేటీఆర్ కు మరింత క్రెడిట్ వచ్చి పడుతోంది.

 Minister Ktr Fear On Hujurabad Constency-ఆ నియోజకవర్గం అంటే కేటీఆర్ కు హడల్ ఎందుకంటే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట్లో కెసిఆర్, హరీష్ రావును ఇదేవిధంగా ప్రోత్సహించినా,  కేటీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు.

 అయితే హుజురాబాద్ ఎన్నికల విషయంలో మాత్రం కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను తన కుమారుడు కేటీఆర్ కు కాకుండా, తన మేనల్లుడు మంత్రి హరీష్ రావు కు అప్పగించారు.ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలోనే ఉన్నా, ఆయనను కాదని హరీష్ కు అప్పగించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న ఈటెల రాజేందర్ సామాన్యుడు కాదు అని, ఆయన బలం, బలగం ఏమిటో కెసిఆర్ , కేటీఆర్ కు బాగా తెలుసు.అందుకే ఇక్కడ కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి ఫలితాలు అనుకూలంగా రాకపోతే, వచ్చిన క్రెడిట్ మొత్తం పోతుందని, కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనే అభిప్రాయంతో కేటీఆర్ ను ఈ విషయంలో పూర్తిగా పక్కన పెట్టారు.

Telugu Etela Rajender, Hujurabad Constency, Hujurabad Elections, Kareemnagar, Ktr, Minister Hareesh Rao, Telangana Cm, Telangana Cm Kcr-Telugu Political News

ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలు చిన్న చిన్న నాయకులకు హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలలో వెల్కం చేసిన కేటీఆర్ ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయడం లేదు.అలాగే హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ కు అంత ఆశాజనకంగా ఉండవు అనే నివేదికలు , ఇలా రకరకాల కారణాలతో కేటీఆర్ ను దూరంగానే పెడుతున్నట్టు కనిపిస్తున్నారు.ఇక కేటీఆర్ కూడా ఈటెల రాజేందర్ కు గట్టి పట్టు ఉన్న హుజూరాబాద్ లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహించినా, ఫలితం తేడా కొడితే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని అలాగే రాజేందర్ చేసే విమర్శలకు సమాధానం చెప్పుకోవాలని మొదటి నుంచి ఆయన టిఆర్ఎస్ లోని ఉండడంతో పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు బాగా తెలుసు ఎలా చూసుకున్నా ఆయనతో ఇబ్బందులు తెచ్చుకోవడమే అన్న అభిప్రాయంతో హుజురాబాద్ వైపు కేటీఆర్ దృష్టి పెట్టకుండా దూరంగానే ఉంటున్నారట.

#Telangana Cm #Hujurabad #Hareesh Rao #Kareemnagar #Etela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు