కేటీఆర్ కార్ కి చలానా.. చలానా పంపించిన కానిస్టేబుల్, ఎస్ఐలకు..?!

చట్టం ఎవరికీ చుట్టం కాదని తెలంగాణాలో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ అని చెప్పాలి.ఎందుకంటే కొంతమంది సామాన్య ప్రజలకు మాత్రమే తప్పు చేస్తే శిక్షలు వేస్తారు.

 Minister Ktr Appreciated Si And Constable For Challan To His Car, Telangana Mini-TeluguStop.com

అధికారంలో ఉన్నవారికి, పదవి పలుకుబడి ఉన్నవారికి శిక్షలు వేయరు వారికి అనుకూలంగా అధికారులు ఉంటారని అభిప్రాయ పడుతూ ఉంటారు.కానీ తెలంగాణా పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించి అందరి చేత ప్రశంసలు పొందారు.ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసి చర్చకు కారణం అయ్యారు.2021, అక్టోబర్ 02వ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజు పురస్కరించుకొని లంగర్ హౌస్ సమీపంలో బాపూఘాట్ లో కార్యక్రమం నిర్వహించారు.అయితే ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్ రూట్ లోకి రావడంతో అక్కడనే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆ వాహనాన్ని ఆపి రాంగ్ రూట్ లో వచ్చినందుకు చలాన్ విధించారు.

ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

అయితే ఇప్పుడు స్వయంగా కేటీఆర్ ఆయన కారుకు చలానా వేసిన ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ కు పిలిచి మరి సన్మానం చేశారు.వీరిద్దరినీ తన కార్యలయానికి పిలిపించి శాలువా కప్పి మరీ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.చట్టాన్ని అతిక్రమించినవారికి శిక్ష అనేది తప్పదు.

అది సామాన్య ప్రజలు కావచ్చు.లేదంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులయిన కావచ్చు.

ఎవరికయినా సరే ఒకేలాంటి నియమ నిబంధనలు వర్తిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Telugu Challan Ktr Car, Venkateswarlu, Fine, Ktr, Ktr Car Route, Si Ilayya, Tela

అలాగే నా కారుకు చలాన్ విధించిన రోజు నేను వాహనంలో లేనని ఆయన తెలిపారు.అంతేకాకుండా మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ సైతం చెల్లించారు.అధికారంలో ఉన్నా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా చట్టాన్ని గౌరవించాలని అందరికి ఒక సందేశం ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ట్రాఫిక్ సిబ్బందిని ఇలా అభినందిస్తున్నని చెప్పుకొచ్చారు.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.ఈ క్రమంలోనే వారిద్దరినీ కేటీఆర్ తన కార్యాలయానికి పిలిపించుకుని వారిద్దిరికీ పుష్ప గుచ్చాలు ఇచ్చి శాలువాతో సత్కరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube