జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ ? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ, ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అంతే స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలో సినీ హీరో నందమూరి వారసుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

 Minister Kodali Nani Sensational Comments On Jr Ntr , Kodali Nani, Ntr, Politica-TeluguStop.com

ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, కాకపోతే ఇప్పట్లో ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని, ఆయనకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉందని, ముందు ముందు మరిన్ని సంచలనాలు జరిగే అవకాశం లేకపోలేదని నాని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారా లేదా, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడతారా అనే విషయం పై క్లారిటీ లేదని, కాకపోతే ముందు ముందు కూడా టీడీపీ చంద్రబాబు కుటుంబం చేతుల్లోనే ఉంటే, తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.

టీడీపీ మళ్లీ బతికి బట్ట కట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళితేనే అవకాశం ఉంటుందని, లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని నాని చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా, ఆషామాషీగా అయితే ఉండదని, ఆయన బాగా కష్టపడాలని, ప్రజల్లో మరింత బలం పెంచుకోవాలని నాని సూచించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రస్తావన కూడా నాని తీసుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో పోటీ చేస్తేనే లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని అన్నారు.

Telugu Chandra Babu, Kodali Nani, Kodalinani, Lokesh-Telugu Political News

అలా కాకుండా, చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా ఫ్యూచర్ లీడర్ లోకేష్ గా ఎన్నికలకు వెళితే కనుక ఆయనను సొంత పార్టీ నాయకులే ఓడిస్తారని కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి లోకేష్ తప్పనిసరిగా అడ్డుపడతారని, చంద్రబాబు వంశం మంచిది కాదంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టినా, తాను మాత్రం జగన్ వెంటే నడుస్తానని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పార్టీలోకి వెళ్లే అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube