అవమానం : మంత్రి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు  

Minister Kidari Sravani Lost మంత్రి-kidari Sravani,telugu Desam Party,ys Jagan,మంత్రి శ్రవణ్‌,ముఖ్య మంత్రి జగన్,సి‌ఎం జగన్

ఏపీలో జగన్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అద్బుతమైన మెజార్టీ దిశగా వైకాపా దూసుకు పోయింది. తెలుగు దేశం పార్టీ గట్టి పోటీ ఇస్తుందని, మరోసారి చంద్రబాబు సీఎం అవుతాడని అంతా అనుకున్న సమయంలో అనూహ్యంగా తెలుగు దేశం పార్టీకి ఏపీ ప్రజలు మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేశారు..

అవమానం : మంత్రి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు-Minister Kidari Sravani Lost మంత్రి

చంద్రబాబు క్యాబినెట్‌లో కేవలం ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారు అంతా కూడా ఓడిపోయారు.ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసిన కిడారి శ్రవణ్‌ పరువు పోయింది. అతడికి ఘోర అవమానం ఎదురైంది.

ఆరు నెలల పాటు మంత్రిగా చేసిన కిడారి ఎమ్మెల్యేగా పోటీ చేసి దారుణ పరాభవంను మూట కట్టుకున్నాడు. మావోయిస్టుల దాడిలో కిడారి సర్వేశ్వరరావు చనిపోగా, ఆయన కొడుకు అయిన శ్రవణ్‌కు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆదుకున్నాడు.ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు, శ్రవణ్‌కు అరకు జనాలు షాక్‌ ఇచ్చారు.

అక్కడ నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అయిన కిడారి శ్రవణ్‌ కు రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కిడారి శ్రవన్‌పై చెట్ట ఫల్గుణ భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఒక మంత్రికి మరీ ఇంతటి పరాభవం ఎదురవ్వడం తీవ్ర చర్చకు తెర తీసినట్లయ్యింది.

ఈ ఫలితాలతో కిడారి శ్రవణ్‌ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.