మంత్రి కాకాణి భూదోపిడీ చేస్తున్నారు..: సోమిరెడ్డి

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ( Minister Kakani Govarthan Reddy )తీవ్ర ఆరోపణలు చేశారు.

మంత్రి కాకాణి ఆధ్వర్యంలో శాశ్వత భూహక్కు పేరిట దోపిడీ జరుగుతోందన్నారు.అంతేకాకుండా కాకాణి అల్లుడి కంపెనీ కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఏడు వేల ఎకరాల భూమి ఇచ్చామంటున్న మంత్రి కాకాణి ఆ వివరాలను మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.పేదలకు తక్కువ డబ్బులు చెల్లించి భూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

కాకాణి భూ ఆక్రమణలపై త్వరలోనే లోకాయుక్తను ఆశ్రయిస్తామని సోమిరెడ్డి తెలిపారు.అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు