ఉత్తమ్ వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్

తెలంగాణలో గత ఎన్నికలలాగానే ముందస్తు ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే గత ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కెసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 Minister Jagadish Reddy Counter To Uttam Kumar Reddy, Minister Jagadish Reddy,ut-TeluguStop.com

అయితే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ముందస్తు, వెనకస్తు ఎన్నికలు అంటూ ఏవీ లేవని సరైన సమయంలోనే ఎన్నికలు వస్తాయని మంత్రి జగదీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ముందస్తు ఎన్నికల పరిణామాలు ఏవీ కనిపించడం లేదు.కెసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలవైపు మొగ్గు చూపించడం లేదని, అందుకే వచ్చే ఎన్నికల వరకు కార్యాచరణ నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో అతి పెద్ద చర్చ నడుస్తోంది.

ఎందుకంటే గత రెండు దఫా ఎన్నికలలో తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి టీ ఆర్ఎస్ పార్టీ విజయం అనేది చాలా సునాయాసంగా జరిగిపోయింది.

కాని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్ కు చాలా క్లిష్టతరమైన రీతిలో ఉన్నాయి.అంతేకాక బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్ర పోటీ అనేది ఎదురావుతోంది.ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికల వైపు కెసీఆర్ మొగ్గు చూపుతారని భావించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య జరిగిన విమర్శలు, ప్రతి విమర్శల అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.ఏది ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో మరొక్క సారి తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన అనేది వచ్చిందని చెప్పవచ్చు.

రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంది కావున మరి ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube