కొణిజేటి రోశయ్య కి నివాళులు అర్పించిన మంత్రి హరీష్ రావు..!!

Minister Harishrao Tribute To Rosaiaha

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2009 , 10 వ సంవత్సరంలో పరిపాలించిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం బీపీతో బాధ పడి తుదిశ్వాస విడవటం తెలిసిందే.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… ఈరోజు లోబీపీ తో మరింత ఇబ్బందులు ఎదుర్కొనడంతో వెంటనే హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది.

 Minister Harishrao Tribute To Rosaiaha-TeluguStop.com

అయితే ఆయన మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.రోశయ్య మరణించిన వార్త ఉదయం.

రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 Minister Harishrao Tribute To Rosaiaha-కొణిజేటి రోశయ్య కి నివాళులు అర్పించిన మంత్రి హరీష్ రావు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో రోశయ్య మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు.

రోశయ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించారు.తెలుగు రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నాయకుడు అని కొనియాడారు.

ప్రతిపక్షాలను కూడా ఒప్పించగలిగి.మెప్పించగలిగే నేర్పరితనం.

రోశయ్య గారికే చెందుతుంది అని తెలిపారు.దాదాపు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశంలో ఎవరికీ దక్కనిది.

, అది  రోశయ్య గారికే దక్కిందని.స్పష్టం చేశారు.ఆయన పనిచేసిన.ప్రతి ముఖ్యమంత్రి చేత శభాష్ అనిపించుకున్నారు అని.ఇటువంటి సీనియర్ నాయకుడు మరణించడం దురదృష్టకరం.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు.

హరీష్ రావు స్పష్టం చేశారు.

#Rosaiah #Budget #Harish Rao #Harishrao #HarishRao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube