రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. బ్యాంకర్లకు హరీష్ రావు విజ్ఞప్తి..!

సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ను నేడు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా గత 17 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని.

 Minister Harish Rao Inaugurated Uinion Bank Branch At Horticulture University,la-TeluguStop.com

దీన్ని దృష్టిలో పెట్టుకుని పేద, మధ్యతరగతి ప్రజలకు లోన్లు అందిస్తూ బ్యాంక్ లు ఆదుకోవాలని అన్నారు.రైతులకు సకాలంలో రుణాలు అందించాలని.

రైతు బంధు, ఫించన్లు, పంట రుణాలలో కోత విధించవద్దని బ్యాంకర్లను కోరారు హరీష్ రావు.లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బ్యాంకర్లు సహకరించాలని అన్నారు.

Telugu Branch, Harish Rao, Horticulture, Bank-General-Telugu

కార్యక్రమంలో భాగంగా త్వరలో ఫారెస్ట్ కళాశాలను ఫారెస్ట్ యూనివర్సిటీ చేసే ఆలోచనలో సీఎం కే.సి.ఆర్ ఉన్నారని మంత్రి వెళ్లడించారు.విద్యార్ధుల సౌలభ్యం కోసం కళాశాల్లోనే బ్యాంక్ సేవలు అందించాలని అన్నారు.

యూనివర్సిటీ ఆవరణలో ఏ.టి.ఎం ఏర్పాటు చేయాలని అందుకు అధికారులు బ్యాంకర్లకు సహకరించాలని హరీష్ రావు చెప్పారు.కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ లు యూనియన్ బ్యాంక్ లో విలీనమైన తర్వాత మొదటి బ్యాచ్ ను సిద్ధిపేట జిల్లా హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నందుకు బ్యాంక్ వర్గాలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో 5వ స్థానంలో తెలంగాణాలో 2వ స్థానంలో యూనియన్ బ్యాంక్ సేవలను అందిస్తుందని మంత్రికి బ్యాంక్ అధికారులు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube