ఇబ్బందులన్నీ హరీష్ కే ? సేఫ్ గేమ్ ఆడుతున్న కేసీఆర్ ? 

రాజకీయ వ్యూహాలు రచించడంలో బాగా ఆరితేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుత శత్రువులతో పాటు , భవిష్యత్తులో తమకు శత్రువులు గా మారవచ్చు అనే వారి విషయంలోనూ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు.రాగల ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ, రాజకీయ చక్రం తిప్పడంలో ఆయన సిద్ధహస్తుడు.

 Minister Hareesh Rao Troubled On Etela Rajender Issue Minister Hareesh Rao, Kcr,-TeluguStop.com

అందుకే ఉద్యమకాలంలో తనతో పాటు పని చేస్తూ,  తెలంగాణ సాధించడంలో కానీ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడంలో గాని కృషి చేసిన వారు అందరినీ ఎటువంటి మొహమాటం లేకుండా కెసిఆర్ పక్కన పెట్టారు.అప్పట్లో కేసీఆర్ నిర్ణయం పై చాలా విమర్శలు వచ్చినా, ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

తన మేనల్లుడు మంత్రి హరీష్ రావు విషయంలోనూ కేసీఆర్ అదే విధంగా వ్యవహరిస్తున్నారు.

హరీష్ తో తనకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, రాబోయే రోజుల్లో తన కుమారుడు మంత్రి కేటీఆర్ కు ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంలో కెసిఆర్ ఇప్పటి నుంచే ఆయనకు పొగ పెడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అసలు చాలాకాలం నుంచి హరీష్ వ్యవహారంపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు.

రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ పెద్దగా ఇష్టపడలేదు.అయితే ఆ తరువాత పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితులు హరీష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు.

ఇక ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటెల రాజేందర్ వ్యవహారంలోనూ కేసీఆర్ ఇదే ఆలోచనతో ముందుకు వెళ్లారు.చాలాకాలం నుంచి పార్టీ పైన తన పైన ముఖ్యంగా కేటీఆర్ విషయంలో ఈటెల అసంతృప్తిగా ఉండడాన్ని గుర్తించిన కేసీఆర్ అకస్మాత్తుగా ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించారు.

Telugu Etela Rajender, Hareesh Rao, Telangana-Telugu Political News

ఆయన వల్ల పార్టీకి ఎక్కువ డామేజ్ జరగకుండా ముందుగానే తన మేనల్లుడు హరీష్ రావు కు ఆ బాధ్యతలు అప్పగించారు.హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ కు జనాల నుంచి , పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేకుండా చేసేందుకు హరీష్ ను రంగంలోకి దించారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే,  పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను హరీష్ కు అప్పగించాలని చూస్తున్నారు.

  దీనిద్వారా ఈటెల తో సన్నిహితంగా మెలిగే హరీష్ రావు కు ఇబ్బందులు వచ్చి పడతాయని, ఈ ఇద్దరి స్నేహం దెబ్బతినడం వల్ల తమకే లాభం అని , ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని ఇద్దరూ ప్రజల్లో చులకన అవుతారని,  ఆ విధంగా ఒకేసారి పార్టీలో ఉన్న ఈ ఇద్దరికీ చెక్ పెట్టినట్లు అవుతుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ పరిస్థితుల పై అటు హరీష్ సైతం అసంతృప్తిగానే ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈటెల పై విమర్శలు చేస్తూ, ఆయన రాజకీయానికి చెక్ పెట్టే బాధ్యతలను సమర్థవంతంగా హరీష్ భుజాన వేసుకున్నారు.

ఏ విధంగా చూసుకున్నా, రానున్న రోజుల్లో హరీష్ కే అన్ని ఇబ్బందులు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.<

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube