టీఆర్ఎస్ లో ఎప్పటి వరకు ఉంటాడో చెప్పేసిన హరీష్ !

ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లుగా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ,మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చ గా మారి  అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ టార్గెట్ అయ్యేలా మారింది.ఒకవైపు రాజేందర్ హరీష్ పై జాలి చూపిస్తున్నట్లుగా మాట్లాడుతూ, మరోవైపు చురకలు వేస్తూ ఉండడం తో హరీష్ రావు అసహనానికి గురవుతున్నారు.

 Minister Hareesh Rao Sensational Comments On Etela Rajender Issue Etela Rajendar-TeluguStop.com

రాజేందర్ వ్యాఖ్యలతో తనపై టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుమానాలు కలిగేలా ఉన్నాయని భావించిన హరీష్ ఈటల రాజేందర్ పై విమర్శలు జోరు మరింత పెంచారు.తన పేరు పదే పదే ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కెసిఆర్ తనకు గురువు, మార్గదర్శి అని, ఆయన మాట ఎప్పటికీ జవదాటను అంటూ హరీష్ రావు ప్రకటించి తనపై ఉన్న అనుమానాలకు చెక్ పెట్టే విధంగా మాట్లాడారు.

సీఎం కేసీఆర్ కేవలం పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు.

నాకు గురువు నా మార్గదర్శి.నాకు తండ్రితో సమానం.

ఆయన మాట జవ దాటకుండా నడుచుకుంటున్నా. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇదేవిధంగా నడుచుకుంటా.

నేను నిబద్ధత, విధేయత క్రమశిక్షణగల కార్యకర్తను.పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ప్రయోజనాలే పరమావధి.

పార్టీ ఏ పని అప్పగించినా, పూర్తి చేయడం నా విధి.కెసిఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసా వహించడం కర్తవ్యంగా భావిస్తా అంటూ హరీష్ వ్యాఖ్యానించారు.

Telugu Etela Rajendar, Hareeshangry, Hareesh Rao, Hujurabad, Telangana-Telugu Po

తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టుగా ఈటెల రాజేందర్ వైఖరి కనిపిస్తోంది.పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చు.ఉండాలా వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం.బయటకు వెళ్తే టిఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదు.ఆయన పార్టీకి చేసిన సేవ కంటే ,పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ.తన సమస్యలకు తన గొడవలకు నైతిక బలం కోసం పదే పదే నా పేరు ప్రస్తావించడం ఈటెల బావ దరిద్రానికి నిదర్శనం.

నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నమే కాదు వికారం కూడా .ఆయన మాటలు మనోవికారం తప్ప సత్యం ఎంత మాత్రం లేదు.నా గురించి ఈటెల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న అంటూ రాజేందర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు హరీష్ రావు చేశారు.అయితే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, రాజేందర్ తో పాటు హరీష్ పైన కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయని, ఆ అనుమానాలకు క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతోనే హరీష్ ఈ విధంగా వివరణ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

<

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube