తలా తోక లేకుండా చంద్రబాబు మాట్లాడటం విడ్డురంగా ఉంది - మంత్రి గుడివాడ అమర్నాధ్

విశాఖ, పెందుర్తి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు మేమెప్పుడు వ్యతిరేకమన్నారు రాష్ట్ర పరిశ్రమల, ఐ.టి.

 Minister Gudivada Amarnath Criticizes Chandrababu Naidu Over Vishaka Steel Plant-TeluguStop.com

శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు.పెందుర్తి నియోజక వర్గం సింహాచలం నుండి పినగాడి 13 కోట్ల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎవరయితే ఈ రోజు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారో.

అటు ప్రభుత్వాలు కావొచ్చు,ఇటు వ్యక్తులు కావొచ్చు, వారు బిడ్డులో పాల్గొంటామన్నప్పుడే వారు ప్రైవేటీకరణ కు మద్దతు ఇస్తున్నట్లు.

మా ప్రభుత్వ విధానాల ఆలోచనలు కానీ, ప్రజల , కార్మిక సంఘాల ఆలోచనలు కానీ ప్రైవేటికరణకి వ్యతిరేకమే.

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 64 కంపెనీల వరకు ప్రైవేట్ పరం చేసినప్పుడు ఎందుకు మూసుకొని కూర్చున్నారు.హిందూస్థాన్ జింక్, బీహెచ్ పివి లాంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 మధ్యలో 64 కంపెనీలు అమ్మేశాడు.అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.మాట్లాడే దానికి అర్ధం ఉండాలి.తలా తోక లేకుండా చంద్రబాబు మాట్లాడటం చాలా విడ్డురంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube