మంత్రి వర్సెస్ మాజీ మంత్రి ! ముదిరిన యుద్ధం ?

తెలంగాణలో మంత్రి వర్సెస్ మాజీమంత్రి వ్యవహారం కాక పుట్టిస్తోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ , ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపిస్తూ హడావుడి చేస్తున్నారు.

 Minister Ganguly Kamalakar Vs Rajendra Sensational Comments, Etela Rajendar, Gan-TeluguStop.com

ఇటీవల తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ కు మధ్య విమర్శలు కాస్త శ్రుతి మించినట్లు గా కనిపిస్తున్నాయి.ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ వచ్చిన సందర్భంగా ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.పూర్తిగా ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసుకున్న టిఆర్ఎస్, కేవలం విమర్శలతో సరిపెట్టకుండా, ఆర్థికంగానూ రాజేందర్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజేందర్ సైతం టిఆర్ఎస్ పై మరింత ఆగ్రహం తో విమర్శలు ఎక్కుపెట్టారు.తాజాగా ఈటెల రాజేందర్ భూ అక్రమాలపై వ్యవహారాలపై ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.

ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాజేందర్ ఈరోజు హుజూరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి తనను టార్గెట్ చేస్తున్న గంగుల కమలాకర్ తీరుని తప్పుపట్టారు.తనను ఎన్ని రకాలుగా వేధించినా పర్వాలేదని కానీ , ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయవద్దని రాజేందర్ చెప్పుకొచ్చారు.

తనకు మద్దతు ఇస్తున్న ప్రజాప్రతినిధులు, అనుచరులను టిఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.తనకు మద్దతు ఇస్తున్న వారిని అన్ని రకాలుగా వేధిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని,  నిధులు విడుదల చేయను అంటూ ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదు బిడ్డా గంగుల గుర్తుపెట్టుకో,  కరీంనగర్ సంపద కొల్లగొట్టినావ్, కరీంనగర్ ను బొందల గడ్డ చేసినవ్, నీ పదవి కేవలం పైరవీల వల్ల వచ్చింది.

నీ బెదిరింపులకు భయపడేవాడిని కాదు, నా ప్రజలకు నీ గురించి మొత్తం తెలుసు.

నాగార్జునసాగర్ లో గెలిచినట్టు ఇక్కడా గెలుస్తాం అంటే ప్రజలు పాతర వేస్తారు.

హుజురాబాద్ ప్రజలను నువ్వు వేదిస్తున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు.ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా అంటూ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

నువ్వు ఎన్ని టాక్స్ లు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు అంటూ గంగుల కమలాకర్ ను ఉద్దేశించి రాజేందర్ విమర్శించారు.దీనిపై గంగుల కమలాకర్ స్పందించారు.

మీసం మెలేసి మరి ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరారు.ఈటెల నీ బెదిరింపులకు భయపడేవారు లేరిక్కడ.

బిడ్డా గిడ్డా అంటే నీ కంటే ఎక్కువ మాట్లాడతా ! అసలు నీకు ఆత్మ గౌరవం అనేది ఉంటే వెంటనే రాజీనామా చేయాలి అంటూ  కమలాకర్ ప్రతిస్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube