కరోనాపై ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై మంత్రి ఈటల ఆగ్రహం..!

కరోనా వైరస్ రోగులకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.

 Telangana, Minister Etela Rajender, Private Hospitals, Corona Cases, Hyderabad,m-TeluguStop.com

ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రులు పద్దతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని ఈటల రాజేందర్ హెచ్చరించారు.ఇప్పటికే పలుసార్లు నిబంధలను ఉల్లంఘించిన ఓ కార్పొరేట్ ఆస్పత్రికి కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు.

కరోనా పరిస్థితిని వ్యాపార కోణంలో చూడొద్దని చెప్పుకొచ్చారు.చిన్న వైద్యానికి లక్షల రూపాయల బిల్లులు వేయడం హేయమైన చర్య అని అన్నారు.

కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు మానవత్వానికే కళంకం తెచ్చిపెట్టేలా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో కరోనా రోగులకు అవసరమైన అక్సిజన్ నిరంతరం సరాఫరా చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

రాష్ట్రంలో 10 వేల పడకలకు మెరుగైన విధంగా ఆక్సిజన్ సరాఫరా జరుగుతోందని అన్నారు.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న రోగులకు కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ అందించినా ప్రయోజనం ఉండబోదని తెలిపారు.

ఇక హితం యాప్ ద్వారా విశ్రాంత వైద్యులు సలహాలు ఇస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు.

ఇక ప్లాస్మా థెరపీపై కొన్ని అంక్షలు ఉన్నాయని, అది అందరికీ అవసరం ఉండదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కరోనాకు అవసరమైన మందులన్నీ పీహెచ్‎సీల్లో అందుబాటుల్లో ఉన్నాయని.

రూ.వెయ్యి లోపు మందులతోనే కరోనా నుంచి కోలుకోవచ్చని ఈటల రాజేందర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube