కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలి -ఈటల

కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకకర్ రావుతో కలిసి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.

 Corona Cases, Minister Etela Rajender, Minister Errabelli Dhayakar Rao, Corona P-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాశ్, కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, సీతక్క, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సవాల్‎గా మారిందని అన్నారు.కొవిడ్ నివారణ కోసం ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు పలు రకాల వ్యాధులను ఎదుర్కొనే సత్తా మనకుందని.ఈ కరోనా వైరస్ ను కూడా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.

కరోనా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారిని సేవలను అందించాలని ఈటల రాజేందర్ కోరారు.ఇక మరోవైపు వైరస్ ను సరైన సమయంలో గుర్తించని వారికే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో 81 శాతం మంది కొవిడ్ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారని అన్నారు.వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదిచాల్సిందేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube