రాయలసీమ గర్జనలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు

Minister Buggana's Key Comments In Rayalaseema Roar

కర్నూలు జిల్లాలో చేపట్టిన రాయలసీమ గర్జన కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్నూలులో హైకోర్టు పెట్టడం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇష్టమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు.

 Minister Buggana's Key Comments In Rayalaseema Roar-TeluguStop.com

సుజల స్రవంతి ప్రాజెక్టుకు దివంగత నేత వైఎస్ఆర్ నాలుగు వేల కోట్లు కేటాయించారన్న బుగ్గన చంద్రబాబు ఇచ్చిందెంత అని ప్రశ్నించారు.మీ దృష్టిలో ఇది రాళ్లసీమ కావచ్చొన్న తమ దృష్టిలో రత్నాలసీమ అని తెలిపారు.

చంద్రబాబుకి ఒక్క అమరావతి మీద మాత్రమే ప్రేమని పేర్కొన్నారు.మీ రియల్ ఎస్టేట్, మీకు బంధువులపై మాత్రమే మీకు ప్రేమంటూ విమర్శించారు.

అదేవిధంగా హైకోర్టు సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపుతో సీమ గర్జనకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube