రాజమండ్రిలో మహానాడు పై మంత్రి బొత్స సీరియస్ వ్యాఖ్యలు..!!

రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ( AP Minister Botsa Satyanarayana ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతుందని అభివర్ణించారు.

 Minister Botsa's Serious Comments On Mahanadu In Rajahmundry , Minister Botsa Sa-TeluguStop.com

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దివంగత ఎన్టీఆర్ పెట్టిన ఒక పథకమైన చంద్రబాబు కొనసాగించారా అని ప్రశ్నించారు.ఆయన అందించిన ఏ సంక్షేమ పథకమైన చంద్రబాబు ప్రజలకు ఆ తర్వాత అందించారా అంటూ నిలదీశారు.14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలను నిరుపేదలుగా మార్చారని మండిపడ్డారు.వైయస్సార్ ( YSR )ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క సంక్షేమ పథకం అయినా గుర్తొస్తుందా అని నిలదీశారు.

విద్యా మరియు వైద్య రంగానికి చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అని నిలదీశారు.

Telugu Cm Jagan, Mahanadu, Botsasmahanadu-Telugu Political News

వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పింది ఎవరు.? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్నది నువ్వు కాదా.? బలహీన వర్గాలను హేళన చేసింది నువ్వు కదా.అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు.చంద్రబాబు దండ వేస్తే ఎన్టీఆర్ ఆత్మకు క్షోభిస్తోందని అన్నారు.

సీఎం జగన్ ( CM Jagan )ని విమర్శించడం తప్ప చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు.అధికారంలోకి రావడం ముఖ్యం కాదని ప్రజలకు ఏం చేశారనేది ముఖ్యమని స్పష్టం చేశారు.

మళ్లీ అధికారంలోకి జగన్ ప్రభుత్వమే వస్తుందని మంత్రి బొత్స జోష్యం చెప్పారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని స్పష్టం చేశారు.సచివాలయం వ్యవస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు.సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.5% అమలు చేశారు.ప్రజలకు జగన్ మీద నమ్మకం ఉంది.మళ్లీ జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube