మేనిఫెస్టో అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించాలని తెలిపారు.
అంతేకానీ ఎవరో చెప్పింది.చూసింది చేయకూడదని మంత్రి బొత్స పేర్కొన్నారు.
తాము మంచి చేశామని భావిస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారన్న ఆయన లేకుంటే చీదరిస్తారని తెలిపారు.అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తాము మంచి చేస్తున్నామన్న నమ్మకం ఉందన్నారు.
ఏపీని నంబర్ వన్ గా చేశామన్న మంత్రి బొత్స ప్రజలు కూడా తమ పక్కనే ఉన్నారని వెల్లడించారు.