పట్టణములో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స

నగర సుందరీకరణ లో భాగంగా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసి, విజయనగరం పట్టణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ వెల్లడించారు.సోమవారం సాయంత్రం స్థానికంగా, కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన గురజాడ సర్కిల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.గురజాడ విగ్రహం చుట్టూ నీటి ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు.అలాగే విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.కూడలిలో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేశారు.సుమారు 5.75 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం పూర్తి చేసింది.

 Minister Botsa Participating In A Development Program In The Town , Minister Bot-TeluguStop.com

అభివృద్ధి పరిచిన గురజాడ సర్కిల్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.

నగర పాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన అనంతరం నగరంలోని 15 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు.ఇందులో భాగంగా గురజాడ సర్కిల్ ను అభివృద్ధి చేసి ప్రారంభించామన్నారు.

మిగిలినవి కూడా దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.నగర అందాలను మరింత ఇనుమడింప చేసే విధంగా రూపుదిద్దుకుంటున్న ప్రధాన కూడళ్లను ప్రజలు వినియోగించి, ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, ఈఈ డాక్టర్ దిలీప్, స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.బైట్ బొత్స సత్యనారాయణ.

రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube