కొంచెం కాదు క్యాబినెట్ మొత్తం ప్రక్షాళన ? సంచలన విషయం చెప్పిన మంత్రి బాలినేని ?

ఏపీ క్యాబినెట్ ప్రక్షాళన విషయమై చాలా కాలంగా చాలా చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ప్రస్తుత మంత్రిమండలి లో దాదాపు 80, 90 శాతం మందిని తప్పించి కొంతమందిని మాత్రమే జగన్ క్యాబినెట్ లో ఉంచుతారని , కీలక శాఖలు నిర్వహిస్తున్న వారిని తప్పిస్తే అనవసర గందరగోళం చోటు చేసుకోవడంతో పాటు , కొత్త ఇబ్బందులు ఏర్పడతాయని ,కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు తమ శాఖల పై పట్టు సాధించే సరికి చాలా సమయం పడుతుందని, కీలక శాఖల విషయంలో ఈ తరహా వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చిపెడతాయి అనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని పూర్తిగా శాఖలపై పట్టు సాధించి లేనివారిని తప్పించి , అవే సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారని, ఈ సారి జరగబోయే మంత్రివర్గ విస్తరణ లో జగన్ సన్నిహితులు అందరికీ చోటు దక్కే పోతుంది అనే ప్రచారం గత కొంత కాలంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

 Balineni Sensational Comments On Ap Cabinet Changes, Ys Jagan, Jagan Govt, Ap Mi-TeluguStop.com

తాజాగా మంత్రిమండలి వ్యవహారంపై జగన్ బంధువు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే ఓ భారీ స్థాయిలో మార్పులు ఉండబోతున్నాయని మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న వారందరినీ పూర్తిగా తప్పించి 100% కొత్తవారిని తీసుకోబోతున్న అని సీఎం జగన్ చెప్పారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గతంలోని వంద శాతం మంత్రులను తప్పిస్తాను అని చెప్పిన విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.అంతేకాదు మంత్రివర్గాన్ని పూర్తిగా మారిస్తే మంచిదని తన అభిప్రాయాన్ని జగన్ కు చెప్పానని,  తనను కూడా మార్చాలని కోరానని తనకు మంత్రి పదవి పోయినా ఎటువంటి బాధ లేదని, తనకు పార్టీ ముఖ్యం అంటూ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Telugu Ap, Bugganarajendar, Jagan, Kodali Nani, Ys Jagan, Ysrcp-Telugu Political

గతంలోనే ఏపీ మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేస్తారని వార్తలు వచ్చినా, కొన్ని కీలక శాఖల విషయంలో జగన్ ఆలోచనలో పడ్డారని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో పాటు,  పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, వంటివారిని మంత్రిమండలిలో కొనసాగిస్తారని అంతా  అభిప్రాయపడుతూ ఉండగా, జగన్ కు సన్నిహితుడు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube